Switch to English

జనసేనకి ‘వైసీపీ’ మార్కు ‘ఖాకీ’ షరతులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా భారీ బహిరంగ సభకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎలాగైతే ‘మహానాడు’ నిర్వహించేదో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటుందో.. జనసేన కూడా అంతే.

రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభల నిమిత్తం పోలీసు యంత్రాంగానికి ‘అనుమతి’ కోసం దరఖాస్తు చేసుకోవడం, పోలీసు శాఖ కొన్ని షరతులతో అనుమతినివ్వడం షరామామూలుగా జరుగుతున్న వ్యవహారమే. ఆయా పార్టీలు కోరిన మేర భద్రతను ఏర్పాటు చేయడం సహా పలు సూచనల్ని కూడా పోలీసు శాఖ చేస్తుంటుంది.

జనసేన పార్టీకి కూడా కొన్ని షరతులు విధించింది పోలీసు శాఖ. కొన్ని సూచనలూ చేసింది. అయితే, ఇందులోని షరతులు పోలీసు శాఖ తరఫున పెట్టినట్లుగా లేవు.. అవేవో వైసీపీ తరఫున పెట్టిన షరతుల్లా వున్నాయి.

బహిరంగ సభకు హాజరయ్యేవారు ఖచ్చితంగా మాస్కులు ధరించాలట. లేదంటే, జరీమానాలు విధిస్తారట. ఇదెక్కడి తంతు.? కోవిడ్ నేపథ్యంలో మాస్క్ తప్పనిసరి నిబంధన అమల్లో వున్నమాట వాస్తవం. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటున్న బహిరంగ సభల్లో మాస్క్ ధారణ అన్నది అస్సలు కనిపించడంలేదు. మరి, అలాంటి బహిరంగ సభల నుంచి ఎంత మేర జరీమానాల్ని పోలీసు శాఖ వసూలు చేసిందో లెక్కలు చెప్పాల్సి వుంటుంది.

ఇక, ఇతర రాజకీయ పార్టీల మీద విమర్శలు చేయకూడదట.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదట. ఇది మరీ కామెడీగా వుంది కదూ.? రాజకీయ పార్టీలన్నాక రాజకీయ విమర్శలు లేకపోతే ఎలా.? మంత్రి కొడాలి నాని మాట్లాడే బూతుల ప్రవాహానికి ఏనాడైనా పోలీసు శాఖ అడ్డుకట్ట వేయగలిగిందా.? లేదే.!

చూస్తోంటే, జనసేన పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో వైసీపీ వెన్నులో వణుకు పుట్టి, పోలీసు శాఖ ద్వారా తన భయాన్నంతా షరతుల రూపంలో బయటపెట్టుకునట్లుగా కనిపిస్తోంది.

నిబంధనలు లేదా షరతులు లేదా సూచనలు.. పోలీసు శాఖ నుంచి అన్ని రాజకీయ పార్టీలకూ ఒకేలా వుండాలి. అంతే తప్ప, అధికార పార్టీ కనుసన్నల్లో షరతులు పెడితే, అది ‘ఖాకీ’ గౌరవాన్ని పెంచదు, తగ్గిస్తుంది.!

 

జనసేనకి ‘వైసీపీ’ మార్కు ‘ఖాకీ’ షరతులు.! జనసేనకి ‘వైసీపీ’ మార్కు ‘ఖాకీ’ షరతులు.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...