Switch to English

ఉద్యోగులు బలిసి కొట్టుకుంటున్నారట: ఇదీ బులుగు పైత్యం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మొన్నేమో సినీ పరిశ్రమ మీద ‘బలిసి కొట్టుకుంటున్నారు’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఇప్పుడేమో, ఉద్యోగుల మీద అదే ‘బలిసి కొట్టుకుంటున్నారు’ అనే పద ప్రయోగం చేసేశారు. ఈ బలిసి కొట్టుకోవడమేంటి.? అసలు ఎవరికి ఇంతలా బలిసిపోయింది.? సినీ పరిశ్రమ కోవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతుండడం, పెద్ద సినిమాలకు కొన్ని రోజులపాటు టిక్కెట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కోరడం, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గించిన సినిమా టిక్కెట్ల ధరల్ని పెంచాలనడం.. ఇలాంటి డిమాండ్లు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల నుంచి వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదాయం ఎక్కువ వస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తెలుగు సినీ పరిశ్రమ గుర్తించడంలేదనీ, బలిసి కొట్టుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి డిజిటల్ డైరెక్టర్‌గా అధికారిక బాధ్యతల్ని, వైసీపీకి చెందిన సోషల్ మీడియా విభాగానికి ఇన్‌ఛార్జిగా బాధ్యతల్నీ నిర్వహిస్తున్న దేవేంద్రరెడ్డి గుర్రంపాటి, ఉద్యోగుల మీద ‘బలిసి కొట్టుకుంటున్నారు’ అంటూ ట్వీటేశారట… అంతలోనే ఆ ట్వీటుని డిలీట్ చేశారట.‘అదంతా ఫేక్..’ అని వైసీపీ మద్దతుదారులు కొందరు అంటున్నారు. అయితే, ట్వీటేసిన వెంటనే వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో దాన్ని డిలీట్ చేసేశారంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇంతకీ, ఏది నిజం.? ఉద్యోగులు నిజంగానే బలిసి కొట్టుకుంటున్నారా.?

ప్రచారంలో వున్న ట్వీటు సారాంశమేంటంటే, ‘ఉద్యోగులు బలిసి కొట్టుకుంటున్నారు.. పీఆర్సీ లేదు.. హెచ్‌ఆర్ఏ లేదు.. జగనన్నా వీళ్ళందిరీన తీసెయ్యండి. ఇంతకి సగం సాలరీకి చాలామంది దొరుకుతారు..’ అని. జనవరి 20 మధ్యాహ్నం 3.40 నిమిషాలకు ఈ ట్వీటు వేసినట్లుగా చెప్పబడుతోంది.
ఈ ట్వీటులో నిజమెంతోగానీ, చాలామంది వైసీపీ మద్దతుదారుల అభిప్రాయాలు ఉద్యోగుల విషయంలో ఇలాగే వున్నాయ్.! వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా కార్మికుల తీరుతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....