Switch to English

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా వైఎస్సార్ వీరాభిమాని.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఇప్పుడిక అంతా క్లియర్.. వైసీపీబీజేపీ మధ్య తెరవెనుకాల ‘అవగాహన’ అందరికీ సుస్పష్టంగా అర్థమయ్యింది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక విషయమై అందరికంటే ముందుగా హడావిడి మొదలు పెట్టిన బీజేపీ అసలు వ్యూహమేంటో తేటతెల్లమయిపోయింది.

‘మేమే తిరుపతిని గెలవబోతున్నాం..’ అని మిగతా పార్టీల కంటే ముందు తిరుపతి వేదికగా ఉప ఎన్నికపై నినదించిన బీజేపీ, ప్రధాన రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారయ్యాక, తీరిగ్గా అభ్యర్థిని ప్రకటించింది. ఆ అభ్యర్థి ఎవరో కాదు మాజీ ఐఏఎస్ రత్నప్రభ. పైగా, ఆమె దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల అమితమైన అభిమానం ఆమెకు.

‘పదేళ్ళ క్రితం డైనమిక్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘోర ప్రమాదంలో మృతి చెందారు. పదేళ్ళ తర్వాత ఆయన కుమారుడు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజు వైఎస్సార్ ఆత్మకు నిజమైన శాంతి..’ అంటూ వైఎస్ జగన్, 2019 ఎన్నికల్లో గెలిచాక ట్వీటేశారు రత్నప్రభ. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. రాజకీయ నాయకులు పూటకో మాట మార్చడం వింతేమీ కాదు. అయితే, రత్న ప్రభ.. సాధారణ రాజకీయ నాయకురాలు కాదు. ఆమె ఐఏఎస్ అధికారికగా కీలక బాధ్యతలు గతంలో నిర్వహించారు. అందునా వైఎస్సార్ అభిమానిగా ఆమెకు పేరుంది. ఇప్పుడామెను తిరుపతి ఉప ఎన్నిక బరిలోకి దింపి, బీజేపీ ఏం సంకేతాలు పంపాలనుకుంటున్నట్టు.?

బలమైన అభ్యర్థిని నిలబెడతాం.. గెలుస్తాం.. అని చెప్పిన బీజేపీ, వైఎస్సార్ అభిమానిని నిలబెట్టి, తిరుపతి ఉప ఎన్నికలో పరోక్షంగా బీజేపీ, వైసీపీకి సహకరించబోతోందన్నమాట. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ప్రస్తుత ఈక్వేషన్స్ ప్రకారం తిరుపతి ఉప ఎన్నిక ఏకపక్షమే. బీజేపీ వాలకం చూస్తోంటే, వైసీపీ ఆశిస్తోన్న రికార్డు మెజార్టీ, ఆ పార్టీకి ఇప్పించేలానే వుంది.

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా వైఎస్సార్ వీరాభిమాని.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...