Switch to English

వైఎస్‌ జగన్‌ కూడా ‘సెటిల్‌మెంట్‌’ ముఖ్యమంత్రేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,461FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు.. పార్టీ పరువుని బజార్న పడేసింది. ఆ ఇద్దరిలో ఒకరు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అయితే, ఇంకొకరు కాకాని గోవర్ధన్‌రెడ్డి. నెల్లూరు జిల్లాకి చెందిన ఈ ఇద్దరు ముఖ్య నేతలూ.. పార్టీని రచ్చకీడ్చేశారు. కాకాని గోవర్ధన్‌రెడ్డి తెరవెనుక వ్యవహారం నడిపితే.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. రచ్చకెక్కి నానా యాగీ చేశారు. ఈ క్రమంలో ఓ మహిళా అధికారిని సైతం కోటంరెడ్డి బెదిరించడంతో.. వ్యవహారం అరెస్టు దాకా వెళ్ళింది.

జర్నలిస్టు మీద దాడికి యత్నించినప్పుడే కోటంరెడ్డిని కంట్రోల్‌ చేయాల్సిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కాస్త తీరిగ్గా స్పందించారు. కోటంరెడ్డి అరెస్ట్‌, బెయిల్‌.. ఇదంతా ఓ ప్రసహనంలా సాగింది. పార్టీ పరువు తీసేసిన కోటంరెడ్డి, కాకానిలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, అమరావతికి పిలిపించుకున్నారు. వారిద్దరి మధ్యా సయోధ్య కుదర్చాలంటూ పార్టీ ముఖ్య నేతల్ని ఆదేశించారు వైఎస్‌ జగన్‌. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. పలువురు మంత్రులు కూడా ‘డ్యామేజీ కంట్రోల్‌’ కార్యక్రమంలో బిజీగా వున్నారు.

తప్పు చేసిన వ్యక్తిని శిక్షించే స్థాయిలో వున్నప్పటికీ.. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఎవరి మీదా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కోటంరెడ్డికి వార్నింగ్‌ ఇస్తే ఇంకేమన్నా వుందా.? అలాగని కాకానికి షాకిస్తే కుదురుతుందా.? అందుకే, ఇప్పుడు వున్నపళంగా ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చేయాలి. ఇలాంటి ‘సెటిల్‌మెంట్లు’ చేసే, తెలుగుదేశం పార్టీకి ఘోరీ కట్టేశారు చంద్రబాబు. అదే పని ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా చేస్తున్నారు.

నిజానికి, కోటంరెడ్డి విషయంలో వైఎస్‌ జగన్‌ అస్సలేమాత్రం క్షమించకూడదు. తెలుగుదేశం పార్టీలో చింతమనేని ప్రభాకర్‌ ఏ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారో.. కోటంరెడ్డిదీ ఇప్పుడు వైసీపీలో అదే పరిస్థితి. చింతమనేని దెబ్బకి ఎలాగైతే టీడీపీ శ్రేణులే విరక్తి చెందాయో.. కోటంరెడ్డి విషయంలోనూ వైసీపీ శ్రేణులు ఇప్పుడు అలాగే విరక్తి చెందుతున్నాయి.. అదీ వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే.. ఆయన చెలరేగిపోతున్నారు. కానీ, కోటంరెడ్డికి షాకిచ్చేంత శక్తి మాత్రం వైఎస్‌ జగన్‌కి లేదు. అందుకే.. ఈ బుజ్జగింపులని అనుకోవాలేమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...