రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించగానే పెను దుమారం చెలరేగింది. తెలుగుదేశం పార్టీ గుస్సా అయ్యింది.. జనసేన పార్టీ మండిపడింది.. వామపక్షాలూ భగ్గుమంటున్నాయి. కానీ, భారతీయ జనతా పార్టీలోనే తీవ్ర గందరగోళం కన్పిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించారంటే, దానికి బలమైన కారణం వుంది. ఏదో ఒక కారణం వెతుక్కుని వైసీపీలోకి వెళ్ళాలని చూస్తున్నారాయన.
అయితే, జగన్ నిర్ణయాన్ని స్వాగతించినందుకే గంటా శ్రీనివాసరావుకి వైసీపీలోకి వెళ్ళే:దుకు లైన్ క్లియర్ అవుతుందని అనుకోలేం. ఇదిలా వుంటే, భారతీయ జనతా పార్టీలో జగన్ ప్రకటనపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, ‘మూడు రాజధానుల’ కాన్సెప్ట్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు మాత్రం, జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు.
తాను గతంలోనే మూడు రాజధానుల విషయమై ఊహించాననీ, ఆ ఊహలకు తగ్గట్టుగానే జగన్ నడుచుకుంటున్నారని సెలవిచ్చారు జీవీఎల్. ఇలా, బీజేపీలో మూడు రాజధానుల విషయమై భిన్న స్వరాలు విన్పిస్తుండడం గమనార్హం. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అయితే, మూడు రాజధానుల విషయంలో జగన్‌ని ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించేస్తున్నారు. జగన్ చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించేస్తున్నారు.
చూస్తోంటే, మూడు రాజధానుల వ్యవహారంతో భారతీయ జనతా పార్టీకి వైఎస్సార్సీపీ చాలా గట్టి దెబ్బ కొట్టినట్లే కన్పిస్తోంది. టీజీ వెంకటేష్ ఆల్రెడీ, వైసీపీతో టచ్‌లోకి వెళ్ళారన్న ప్రచారం జరుగుతోంది. సుజనా చౌదరి మాత్రం, ఈ వ్యవహారంలో చంద్రబాబుని వెనకేసుకొస్తున్నారు. మొత్తమ్మీద, ఓ వారం రోజుల్లో రాజధాని సహా, రాష్ట్ర అభివృద్ధిపై జగన్ ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక వస్తుంది కాబట్టి.. ఆ తర్వాతే మూడు రాజధానుల ప్రకపంనల తాలూకు అసలు తీవ్రత కన్పించబోతోంది. అప్పుడిక ఏపీలో బీజేపీ ప్రాంతాల వారీగా విడిపోతుందా.? ఆ పరిస్థితి వస్తే, వైసీపీపై బీజేపీ ఎదురు తిరుగుతుందా.? వేచి చూడాల్సిందే.
420178 491257Hello there. I required to inquire some thingis this a wordpress web site as we are thinking about transferring across to WP. Moreover did you make this theme all by yourself? Cheers. 389790
957361 108167Spot on with this write-up, I truly assume this web site needs a lot a lot more consideration. Ill probably be once far more to read far more, thanks for that information. 295904
908894 435943Appreciate it for helping out, superb details. 504322
979927 604700Visiting begin a business venture around the web usually means exposing your products or services moreover provider not only to some individuals inside your town, but however to a lot of future prospects who could be over the internet many times. effortless internet business 63877