Switch to English

సిగ్గు సిగ్గు: పవన్‌ కళ్యాణ్‌పై ‘పచ్చ మీడియా’ ఏడుపు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

మూడు రాజధానుల ఎపిసోడ్‌ ‘పచ్చ మీడియా’లోని ఓ ప్రముఖ మీడియా సంస్థకి అస్సలేమాత్రం మింగుడుపడ్డంలేదు. ఇక్కడో ఆసక్తికరమైన విషయమేంటంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి.. పవన్‌ కళ్యాణ్‌ని ప్రశ్నిస్తోంది ‘పచ్చ మీడియా’. ఓ మీడియా సంస్థని స్థాపించి, దాంట్లోంచి బయటకు వచ్చి ‘పచ్చ మీడియా’లో మళ్ళీ చేరిన ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌.. తన ‘ఊసరవెల్లి’ అవతారాన్ని బయటపెట్టేసుకున్నాడు. గతంలో మూడు రాజధానులకు మద్దతిస్తూ.. తన సొంత మీడియా ఛానల్‌లో ఉపన్యాసం దంచేసిన సదరు సీనియర్‌ జర్నలిస్టు, ఇప్పుడు మూడు రాజధానులపై భగ్గుమంటున్నాడు.. ఈ క్రమంలో ‘పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెప్పాలి..’ అంటూ బీభత్సమైన కామెడీ చేశాడు. అక్కడికేదో సదరు జర్నలిస్టుకి అమరావతిలో ఓ వెయ్యి ఎకరాలున్నట్టు.. దాన్ని ప్రభుత్వమో, పవన్‌ కళ్యాణో స్వాధీనం చేసుకున్నట్లూ ఆవేశంతో ఊగిపోయాడు.

నిజానికి, అమరావతి విషయంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మొదటి నుంచీ ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారు. ‘ప్రభుత్వానికి భూములు ఇచ్చే క్రమంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి..’ అని రైతులకు సలహా ఇచ్చారు. ‘ప్రభుత్వాలు మారితే, ఒప్పందాలు రద్దయ్యే పరిస్థితి వుండకూడదు.. ఆ దిశగా స్పష్టత తీసుకున్నాకే భూములు ఇవ్వాలి..’ అని రైతుల్ని ఎడ్యుకేట్‌ చేసే ప్రయత్నం చేశారు. ‘ప్రభుత్వం, రైతుల త్యాగాన్ని వృధా కానీయకూడదు.. ప్రభుత్వం మారినాసరే.. ప్రభుత్వంతో రైతులు చేసుకున్న ఒప్పందాలకు చట్టబద్ధత వుండాలి..’ అని అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికీ అల్టిమేటం జారీ చేశారు. అప్పట్లో కొందరు టీడీపీ మద్దతుదారులు పవన్‌ కళ్యాణ్‌పై అమరావతిలోనే రాళ్ళేశారు. ఇప్పుడు మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌ మీదనే టీడీపీ దాడి షురూ అయ్యింది.

సోషల్‌ మీడియాలో నిన్న సాయంత్రం నుంచి పడ్డ ట్వీట్లు చూస్తే, అందులో మేగ్జిమమ్ ట్వీట్లు పవన్‌ కళ్యాణ్‌ మీదనే కావడం గమనార్హం. పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీకి వున్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే.. ఆ ఎమ్మెల్యే కూడా పార్టీకి దూరంగా వుంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెబితే, మూడు రాజధానులు ఆగిపోతాయా.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ‘పచ్చ మీడియా.. అలాగే పచ్చ పార్టీ’ తీరు. ‘అమరావతినే రాజధానిగా కొనసాగించాలి..’ అని బీజేపీ చెబుతోంది. ‘అమరావతికి జనసేన కట్టుబడి ఉంది..’ అని జనసేన నేతలు చెబుతున్నారు. టీడీపీకి చెందిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే మాత్రం ‘అయ్యిందేదో అయిపోయింది.. విశాఖ విషయంలో వ్యతిరేకత అనవసరం..’ అని నినదిస్తున్నారాయె. పచ్చ పార్టీనో, పచ్చ మీడియానో.. తొలుత ప్రశ్నించుకోవాల్సింది తమను తామే. ఆ తర్వాతే, ఇతరుల జోలికి వెళ్ళాల్సి వుంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...