Switch to English

జనసేన మహిళా నేత ఇంటిపై దాడి: వైసీపీ ‘కథ’ ఇదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీకి చెందిన మహిళా నేతపై, జనసేన పార్టీకే చెందిన ఓ వ్యక్తి దాడి చేశాడట. ఇదీ వైసీపీ అల్లుతోన్న కట్టుకథ. ఇదంతా పెద్ద డ్రామా అనీ, ఈ డ్రామాని జనసేన, బీజేపీ కలిసి రక్తికట్టిస్తున్నాయనీ వైసీపీ ఆరోపిస్తోంది. అసలేంటి కథ.? అంటే, శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి నగరం వినుత, రాజకీయంగా చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. కరోనా సమయంలో, పేదల్ని ఆదుకునేందుకు చాలా చాలా కార్యక్రమాలు చేపట్టారు వినుత. ఈ క్రమంలో స్థానిక వైసీపీ శ్రేణులు వీలు చిక్కినప్పుడల్లా జనసేనపై దాడులకు యత్నిస్తున్నారు.

నియోజకవర్గంలో వైసీపీకి ధీటుగా జనసేన ఎదుగుతుండడంతో స్థానిక వైసీపీ నాయకత్వం అక్కసు పెంచుకున్నట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వినుత ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ వ్యవహారాన్ని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ దాడుల్ని ఖండించిన జనసేనాని పవన్‌, అధికార పార్టీ అకృత్యాలకు బెదిరేది లేదని స్పష్టం చేశారు.. వినుత కుటుంబానికి జనసేన అండగా వుంటుందని స్పష్టం చేశారు.

మరోపక్క, జనసేన మిత్రపక్షం బీజేపీ కూడా, ఈ వ్యవహారాన్ని సీరియజ్‌గా తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, వినుత కుటుంబాన్ని పరామర్శించారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడే, వైసీపీకి ఒళ్ళు మండిపోయింది. తమ బండారం బయటపడుతుందన్న కోణంలో కొత్త కథని తెరపైకి తెచ్చింది.

వినుత అనుచరుల్లో ఒకరైన శివకుమార్‌ ఈ దాడులకు పాల్పడినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. చిత్రమేంటంటే, వినుత కుటుంబం గతంలో వైసీపీలో పనిచేశారట.. శివకుమార్‌ కూడా అప్పుడు వైసీపీలోనే వున్నారట.. కరోనా నేపథ్యంలో వినుత కోసం శివకుమార్‌ చాలా ఖర్చు చేశారట జనసేన తరఫున. ఆ వ్యవహారాల్లో తేడాలొచ్చి శివకుమార్‌, వినుత ఇంటిపై దాడి చేశాడని వైసీపీ కొత్త కథని ప్రచారంలోకి తెచ్చింది.

ఈ వ్యవహారంపై జనసేన నేత వినుత తీవ్రంగా స్పందిస్తున్నారు. అధికార పార్టీ కక్షపూరితంగా చేస్తోన్న రాజకీయ దాడులకు కొత్త కథలు అల్లుతోందని మండిపడుతున్నారామె. తిరుపతి ఉప ఎన్నిక త్వరలో జరగనుండగా, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ ఘటన రాజకీయంగా కాక రేపుతోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

రాజకీయం

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

ఎక్కువ చదివినవి

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...