పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న విషయం విదితమే. ఇప్పటికే చిత్ర బృందం ప్రోమోస్ విడుదల చేయడం, అవి అంచనాల్ని మించి ఆకట్టుకోవడం తెలిసిన సంగతులే.
మలయాళ సినిమా ‘అయ్యపనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’. రీమేక్ సినిమా అయినా, ‘భీమ్లా నాయక్’ మీద అంచనాలు అనూహ్యంగా పెరిగాయంటే, దానిక్కారణం పవన్ కళ్యాణ్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
అయితే, ఎలాగైనా, ‘భీమ్లానాయక్’ సినిమాని బదనాం చేయాలనే రాజకీయ ప్రయత్నాలైతే గట్టిగా తెరవెనుకాల సాగుతున్నాయి. గతంలో ఎలాగైతే, ‘వకీల్ సాబ్’ సినిమాపై పొలిటికల్ వేటు వేయడానికి ప్రయత్నించారో, ఇప్పుడూ అంతకు మించిన పొలిటికల్ దాడి ‘భీమ్లా నాయక్’ మీద చేయడానికి సిద్ధంగా వున్నారు. ఇందుకోసం, ‘భీమ్లానాయక్’ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. అంటూ గాసిప్స్ షురూ అయ్యాయి.
‘పెయిడ్ ఆర్టికల్స్’కి అలవాటుపడిపోయిన కొన్ని వెబ్ మీడియా సంస్థలు, కొన్ని న్యూస్ చానళ్ళు.. పవన్ కళ్యాణ్ విషయంలో మరీ కక్కుర్తి పడిపోవడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. అందునా, బులుగు మీడియా మరీ దిగజారిపోతూ వస్తోంది.
‘భీమ్లానాయక్’ మీద మొదలైన నెగెటివ్ ప్రచారం నేపథ్యంలో చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. సినిమా నేరుగా థియేటర్లలోనే విడుదలువుతందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. జనవరి 12న ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇటీవల, సినీ పరిశ్రమలోని సమస్యల్ని ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో ఏకరువు పెడుతూ, రాజకీయ విమర్శలు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. పాపం, వారి ఆవేదనను తట్టుకోలేక, బులుగు మీడియా.. ఇలా ‘భీమ్లా నాయక్’ మీద విష ప్రచారానికి తెగబడిందని అనుకోవాలేమో.
‘భీమ్లానాయక్’ సంక్రాంతికి వస్తోంది. ‘వకీల్ సాబ్’ మీద ఎంత విషం చిమ్మినా, అనూహ్యమైన రీతిలో వసూళ్ళను కొల్లగొట్టింది. ఆ వివరాల్ని స్వయంగా ఏపీ మంత్రి వెల్లడించిన విషయం విదితమే. ఒకవేళ ‘భీమ్లానాయక్’ సినిమాని అడ్డుకోవాలని ఏపీలోని అధికార పార్టీ అనుకుంటే.. దానికోసం ఎన్ని అడ్డదార్లు తొక్కాలో ఏమో.. అదీ ఒకందుకు మంచిదే.. ‘భీమ్లానాయక్’ సినిమాకి అదనపు పబ్లిసిటీ వచ్చిపడుతుంది.
పవన్ కళ్యాణ్ ఎవరికీ భయపడే రకం కాదు, ‘ఎవడ్రా మన సినిమాని అడ్డుకునేది.?’ అంటూ పవన్ తనదైన స్టయిల్లో రిపబ్లిక్ సినిమా వేడుకలో వ్యాఖ్యానించిన విషయం విదితమే.
597833 315947Satisfying posting. It would appear that plenty of the stages are depending upon the originality aspect. Its a funny thing about life if you refuse to accept anything but the most effective, you really often get it. by W. Somerset Maugham.. 835131
169167 487775fantastic submit, very informative. 267471
577170 540266Does your weblog have a contact page? Im having a tough time locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your weblog you may be interested in hearing. Either way, great internet site and I look forward to seeing it expand more than time. 563531