Switch to English

బీజేపీకి వీర్రాజు ‘పవర్’: పండగ చేస్కుంటున్న వైసీపీ, డీలాపడ్డ టీడీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

ఊళ్ళో పెళ్ళికి ‘అదేదో’ హడావిడి.. అన్నట్టు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకంపై సోషల్‌ మీడియాలో వైసీపీ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ మద్దతుదారులు పూర్తిగా డీలాపడిపోయారు. నిజానికి, అది బీజేపీ అంతర్గత వ్యవహారం. బీజేపీ – జనసేన మిత్రపక్షాలు గనుక.. జనసేన పార్టీ శ్రేణులు ఈ వ్యవహారంపై స్పందిస్తే అదో లెక్క. కానీ, వైసీపీ అత్యుత్సాహమేమిటిక్కడ.? ‘సోము వీర్రాజుకి చంద్రబాబు అంటే అస్సలు గిట్టదు.. బీజేపీ – టీడీపీ పొత్తు వున్నప్పుడు కూడా సోము వీర్రాజు, చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేవారు.. ఇప్పుడు ఆయనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. ఇకపై చంద్రబాబుకి మూడినట్లే..’ అన్నది వైసీపీ మద్దతుదారుల వాదన. అది నిజమా.? కాదా.? అన్నది వేరే చర్చ.

సోము వీర్రాజు చాలా చాలా అగ్రెసివ్‌. విమర్శలు చేయాల్సి వస్తే.. ఎవర్నీ ఉపేక్షించరాయన. వైసీపీలోకి వెళ్లాల్సిన కన్నా లక్ష్మినారాయణ, బీజేపీలోకి రావడంతో సోము వీర్రాజుకి అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం తృటిలో తప్పిపోయిన మాట వాస్తవం. బీజేపీలోకి కన్నా లక్ష్మినారాయణను పంపించిందే వైసీపీ.. అన్న వాదన కూడా అప్పట్లో గట్టిగా విన్పించిందనుకోండి.. అది వేరే విషయం. కన్నా లక్ష్మినారాయణ మీద ‘ప్రో టీడీపీ’ అనే ముద్ర వేసింది కూడా వైసీపీనే.

ఇక, ఇప్పుడు బీజేపీలో అసలు సిసలు ‘కాషాయ సైన్యం’ జూలు విదల్చనుంది. ఈ దెబ్బకి బీజేపీలోని టీడీపీ సానుభూతిపరులు, వైసీపీ సానుభూతిపరులు.. ఇద్దరూ బెంబేలెత్తాల్సిందే. ఎటూ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం గనుక.. బీజేపీ, టీడీపీని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చాలా వ్యూహాల్నే రచిస్తోంది. ఈ క్రమంలో తమకు జనసేన ఉపకరిస్తుందన్న భావనతోనే జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది.

పైగా సోము వీర్రాజు అంటే, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కి అత్యంత ఆప్తుడు. ఈ ఈక్వేషన్స్‌ అన్నీ పరిగణనలోకి తీసుకుంటే రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన మలుపులు చూయడబోతున్నామన్నది నిస్సందేహం. ప్రస్తుతానికి పండగ చేసుకుంటున్న వైసీపీకి ముందు ముందు ఏపీలో బీజేపీ – జనసేన ఇచ్చే షాక్‌ ఓ రేంజ్‌లో వుండబోతోంది. టీడీపీ సంగతంటారా.. ప్రస్తుతానికి ఆ పార్టీకి ఏపీలో అంత సీన్‌ కన్పించడంలేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

రాజకీయం

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

ఎక్కువ చదివినవి

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...