Switch to English

‘రాంగ్‌ డైరెక్షన్‌’పై వైఎస్‌ జగన్‌ అసహనం.!

విశాఖపట్నంలో నిన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విషయంలో వైఎస్సార్సీపీ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. చంద్రబాబు యెదుట నిరసన తెలిపే క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణుల ఓవరాక్షన్‌ సుస్పష్టం. చంద్రబాబుని అడ్డుకుంటే, తద్వారా మూడు రాజధానులకు ప్రజలు అనుకూలంగా వున్నారనీ, విశాఖ ప్రజలు ఇంకా అనుకూలంగా వున్నారనే విషయం ఎలివేట్‌ అవుతుందని ఓ సీనియర్‌ మంత్రితో కలిసి ఇంకో మంత్రి కలిసి వేసిన ‘పాచిక’ బెడిసి కొట్టింది.

ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, సదరు మంత్రులకు గట్టిగానే క్లాస్‌ తీసుకున్నారట. ‘పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి కారణం మీరే.. సరైన మానిటరింగ్‌ లేకపోవడంతో పరిస్థితి ఇలా దిగజారింది..’ అని ముఖ్యమంత్రి స్వయానా క్లాస్‌ పీకే సరికి, డ్యామేజ్‌ కంట్రోల్‌ చర్యలకు ఆ మంత్రులు దిగినట్లు తెలుస్తోంది.

కాగా, పోలీసులు టీడీపీ అధినేత చంద్రబాబుకి 151 సెక్షన్‌ కింద నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ‘అధికారంలో వున్నవారికి ఒకలా, ప్రతిపక్షంలో వున్నవారికి ఇంకోలా నిబంధనలు వుంటాయా.?’ అని పోలీస్‌ వ్యవస్థను న్యాయస్థానం ప్రశ్నించడం గమనార్హం. దాంతో, సదరు మంత్రులకు ముఖ్యమంత్రి మరింతగా ఇంకోసారి క్లాస్‌ పీకే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి మరింత భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చంద్రబాబుకి ఎలా భద్రత తగ్గించాలా.? అని అధికార పార్టీ రకరకాల ఎత్తుగడలు వేస్తోన్న విషయం విదితమే. విశాఖ ఎపిసోడ్‌ తర్వాత మొత్తం సీన్‌ మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓ భూమి విషయమై అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనీ, ఆ విషయంలో ప్రతిపక్షానికి ఛాన్స్‌ ఇవ్వకూడదన్న కోణంలో నిన్న యాగీ చేస్తే, అది మొదటికే మోసమొచ్చిందని సాక్షాత్తూ వైసీపీ ముఖ్య నేత ఒకరు తన సన్నిహితుల వద్ద వాపోయారట.

మొత్తమ్మీద, వైసీపీ మరోమారు తప్పులో కాలేసిందన్నమాట. ఆందోళనకారులకి బిర్యానీ ప్యాకెట్లు, మద్యంతోపాటు 500 నుంచి 1000 రూపాయలదాకా ‘నగదు ప్రోత్సాహకం’ అందించి మరీ రచ్చ చేయిస్తే.. ఇదిగో, ఇప్పుడిలా మొట్టికాయలు తినాల్సి వస్తోంది మరి.!

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

ఫైర్ యాక్సిడెంట్: సికింద్రాబాద్ లో బూడిదైన 10 గుడిసెలు.!

తెలంగాణ, సికింద్రాబాద్, బోయినపల్లిలోని బాపూజీ నగర్ లో గుడిసెల్లో రోజువారి కూలీలు నివాసం ఉంటారు. అక్కడ ఒక్క గుడిసెలో సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. అతి తక్కువ టైములో...

బర్త్‌డే స్పెషల్‌ : తెలుగు సినిమాకు సరికొత్త హంగులు అద్దిన సినీ శాస్త్రవేత్త

తెలుగు సినిమా గురించి మాట్లాడాలంటే, తెలుగు సినిమా చరిత్ర గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ పేరు ఎత్తకుండా మాట్లాడటం అసాధ్యం. తెలుగు సినిమా అనే ప్రయోగశాలలో కృష్ణ ఎన్నో ప్రయోగాలు...

క్రైమ్ న్యూస్: కన్న తల్లిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన కొడుకు

నల్లగొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. వృద్ధురాలు అయిన తల్లిని సాకలేక ఆమె బాగోగులు చూసుకోలేక కిరోసిన్ పోసి నిద్రలో ఉండగానే చంపేశాడు. పాపం ఆ పిచ్చి తల్లి చనిపోయిన...

కరోనా టెస్టింగ్‌ కిట్‌ మింగేసిన కోతులు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన వారిని కోతులు మరింతగా భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మీరట్‌లో కరోనా అనుమానితుల నుండి స్వీకరించిన శాంపిల్స్‌ను కొన్ని కోతులు మింగేయడంతో...

ఇన్‌సైడ్‌ స్టోరీ: చిరంజీవిపైకి బాలయ్యను ఎగదోస్తున్నదెవరు.?

మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ సినీ పరిశ్రమలో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకోసం ఏర్పాటయిన విషయం విదితమే. పలువురు సినీ ప్రముఖులు ఈ బృహత్‌ కార్యక్రమానికి చిరంజీవి...