రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ని ఇటీవలే అనౌన్స్ చేసారు. టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుండి టైటిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ చూసినవాళ్లంతా బాబోయ్ .. విజయ్ ఏంటి ఇలా ఉన్నాడు అంటూ షాక్ అవుతున్నారు.
ఎందుకంటే ఇందులో విజయ్ లుక్ చూస్తుంటే .. అర్జున్ రెడ్డి కంటే రెట్టింపు కంత్రిలా ఉన్నాడు. లవర్ బాయ్ గా భిన్నమైన గెటప్ లో కనిపిస్తాడేమో అంటే .. లవ్ ఫెయిల్ అయి .. అన్ని విధాలుగా జీవితం పోగొట్టుకున్న వాడిగా కనిపిస్తున్నాడు .. అంటే .. విజయ్ లుక్ లో మోడరన్ దేవదాస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాడు. దేవదాసా .. లేక పిచ్చోడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయ్ న్యూ గెటప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసే హీరో ఫస్ట్ లుక్ టోన్ ఇలాంటి షాక్ ఇచ్చారంటే .. సినిమా ఎలా ఉంటుందో అంటూ సినిమా పై క్యూరియాసిటీ ఎక్కువైంది. విజయ్ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లి లాంటి బ్యూటీస్ నటిస్తున్నారు .. మరి ఈ సినిమాతో విజయ్ మరో సరి దుమారం రేపడం ఖాయం అని అంటున్నాయి సినీ వర్గాలు !!
