మహానటి ఫేమ్ .. కీర్తి సురేష్ కి తాజాగా బాలీవుడ్ నుండి కాల్ వచ్చిందట .. ఇప్పటికే సౌత్ లో హీరోయిన్ గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు మహానటి సినిమాతో నటిగా మరో మెట్టు ఎక్కింది. మహానటి తరువాత సౌత్ లో అవకాశాలు జోరుగా వస్తాయని అనుకున్నారు కానీ దానికి రివర్స్ గా మహానటి విడుదలై రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటికి కీర్తి సురేష్ చేస్తున్నది ఒకే ఒక్క సినిమా.. అదే మిస్ ఇండియా. ఆ సినిమా తరువాత కీర్తి సురేష్ ఓ బాలీవుడ్ ఛాన్స్ పట్టేసింది.
ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తాడని, ఫుట్ బాల్ పితామహుడిగా పేరుగాంచిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ గా ఇది ఉంటుందని ఆ సినిమాకు మైదాన్ అనే టైటిల్ ఖరారు చేసారు. అమిత్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్ ని సంప్రదించారని, కథ నచ్చడంతో కీర్తి కూడా ఓకే చెప్పినట్టు టాక్ .
సో కీర్తి సురేష్ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ దక్కించుకున్న కీర్తి సురేష్ మరో బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.
