Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: చైనాతో యుద్ధానికి సిద్ధమవుతున్నామా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

జమ్మూకాశ్మీర్‌లో రెండు నెలలకు సరిపడా వంట గ్యాస్‌ సిలెండర్లను సిద్ధం చేస్తున్నారట. ఇది యుద్ధ సంకేతమేనన్న ప్రచారం జరుగుతోంది. మరోపక్క, కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అమిత్‌ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా త్వరలో బాధ్యతలు తీసుకోనున్నారంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. మరి, ప్రస్తుత డిఫెన్స్‌ మినిస్టర్‌ రాజ్‌నాథ్‌సింగ్‌ మాటేమిటి.? అంటే, ఆయన్ని వేరే శాఖకు మార్చుతారన్నది సదరు గాసిప్స్‌ సారాంశం. సరిహద్దుల్లో చైనా కదలికలు పెరుగుతున్నాయి. దానికి ధీటుగా భారత సైన్యం కూడా భారీ స్థాయిలోనే మోహరింపులు చేస్తోంది.

ఓ వైపు పాకిస్తాన్‌, ఇంకో వైపు చైనా.. వీటితోపాటే బుసలు కొడుతున్న నేపాల్‌.. వెరసి, పరిస్థితులు కాస్తంత ఇబ్బందికరంగానే మారాయి భారతదేశానికి. పరిస్థితి చూస్తోంటే, ఏ క్షణాన అయినా యుద్ధం మొదలవ్వొచ్చు.. అన్న వాదనలు కొందరు రాజకీయ విశ్లేషకుల నుంచి విన్పిస్తున్నాయి. ‘రెండు యుద్ధాలు చేస్తున్నాం.. ఒకటి కరోనా వైరస్‌తో, ఇంకోటి సరిహద్దుల్లో చైనాతో..’ అంటూ ఇటీవల అమిత్‌ షా వ్యాఖ్యానించారు. అంతేనా, రెండు యుద్ధాల్లోనూ గెలుస్తాం.. అని ధీమా వ్యక్తం చేశారాయన.

ప్రస్తుతం దేశమంతా కరోనా సంక్షోభంలో వుంది. దేశమే కాదు.. ప్రపంచమంతా కరోనా సంక్షోభంలోనే వుంది. ఆ సంక్షోభానికి కారణం చైనానే. ఆ సంగతి తెలిసీ అగ్రరాజ్యం అమెరికానే, చైనాని ఏమీ చేయలేకపోతోంది. ‘భారతదేశానికి అవసరమైతే సైనిక సాయం అందిస్తాం..’ అని అమెరికా, భారతదేశానికి స్నేహ హస్తం అందిస్తున్నా, అమెరికాని అంత తేలిగ్గా నమ్మడానికి వీల్లేదు. భారతదేశానికి నమ్మదగ్గ స్నేహం రష్యా రూపంలో ఎప్పుడూ వుంటుంది. అయితే, రష్యాకి భారతదేశంతోపాటు చైనాతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా కొంతమేర ఇరు దేశాల మధ్యా రాయబారం కూడా నిర్వహిస్తోంది. అయితే, చైనా మాత్రం తన దూకుడుని కొనసాగిస్తోంది.

ఏదిఏమైనా, చైనాతో కావొచ్చు.. మరో దేశంతో కావొచ్చు.. ఇప్పటికిప్పుడు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు భారతదేశం. అలాగని, శతృవు రెచ్చిపోతోంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తీ వుండదనుకోండి.. అది వేరే విషయం. అందుకే, సరిహద్దుల్లో మోహరింపులు పెరిగాయి. కనీ వినీ ఎరుగని స్థాయిలో ముందస్తు యుద్ధ వాతావరణం అయితే సరిహద్దుల్లో కన్పిస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...