Switch to English

ఎస్ఈసీ రమేశ్ ను అభిశంసిస్తారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

పంటి కింది రాయిలా ఇబ్బంది తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఏపీ సర్కారు ఎలాంటి వైఖరి అవలంభించబోతోంది? అభిశంసన ద్వారా ఆయన్ను సాగనంపాలని యోచిస్తోందా? అది సాధ్యమవుతుందా? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఎస్ఈసీని తొలగించడాలనికి అవకాశం ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2016లో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియమితులయ్యారు. 2021 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. అయితే, సాధ్యమైనంత త్వరగా ఆయన్ను పదవి నుంచి తప్పించాలని అధికార వైసీపీ భావిస్తోంది. ఇందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో పరిశీలిస్తోంది. హైకోర్టు న్యాయమూర్తితో సమానంగా అధికారాలు కలిగిన ఎస్ఈసీని తొలగించడం అంత సులభం కాదు. ఇందుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి మూడింట రెండొంతుల మంది ఆమోదించాలి. అనంతరం దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే.. ఆ మేరకు కేంద్రం ఆయన్ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేస్తుంది.

అసెంబ్లీలో తిరుగులేని మెజార్టీ ఉన్న జగన్ సర్కారుకు ఎస్ఈసీని అభిశంసిస్తూ తీర్మానం చేసి, దానిని ఆమోదించడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. అయితే, దానిని కేంద్రం వెంటనే ఆమోదిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర బీజేపీ నేతలు ఎస్ఈసీ నిమ్మగడ్డకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారా అన్నది చెప్పలేం. ఇప్పటికే మండలిని రద్దు చేస్తూ శాసనసభ చేసిన తీర్మానంపై కేంద్రం ఇంకా ఎలాంటి చర్యా తీసుకోలేదు. నిమ్మగడ్డకు కేంద్ర పెద్దల అండ ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా అన్నది చెప్పలేని పరిస్థితి.

కేంద్రం తమకు మద్దతుగా నిలుస్తుందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఎస్ఈసీకి చెక్ చెప్పే దిశగానే జగన్ సర్కారు వ్యూహాలు పన్నుతోంది. అభిశంసన ద్వారా ఆయన్ను తొలగించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. భద్రత కల్పించాలంటూ తమకు అందిన లేఖ ఆయన నుంచి వచ్చిందనే తాము భావిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది.

ప్రభుత్వంపై ఓ రాజకీయ నాయకుడిగా ఆయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఇదే అంశంతో ఎస్ఈసీని అభిశంసించాలని సర్కారు యోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది వర్కవుట్ కాని పక్షంలో అదనంగా మరో ఇద్దరు కమిషనర్లను నియమించడం ద్వారా ఎస్ఈసీకి కొంతమేర చెక్ చెప్పాలని అధికార పార్టీ ఆలోచిస్తోంది. మొత్తానికి ఎస్ఈసీ వర్సెస్ ఏపీ సర్కారు వ్యవహారం మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...