ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ ఆ తర్వాత టాలీవుడ్లో ఒక మంచి స్థాయిని దక్కించుకుని స్టార్ హీరోయిన్గా మారుతుందని అంతా అనుకున్నారు. మొదటి సినిమాలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయడంతో పాటు బోల్డ్ పాత్రను చేసినందుకు గాను అంతా కూడా పాయల్ రాజ్పూత్ను ప్రశంసల్లో ముంచెత్తారు. అదే స్థాయిలో ఆమెకు ఆఫర్లు కూడా వచ్చాయి.
మొదటి సినిమా హిట్ అవ్వడంతో సహజంగానే వరుసగా సినిమాలు వస్తాయి. కాని కాస్త జాగ్రత్తగా ఉండకుంటే కెరీర్ ఖతం అవుతుందనే విషయం ఈ అమ్మడిని చూస్తే అర్థం అవుతుంది. ఎందుకంటే ఈమె కెరీర్ ప్రస్తుతం కష్టాల్లో పడినది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా ఒప్పుకుంది. తాజాగా సన్నిహితుల వద్ద తన కెరీర్లో వెంకీమామ చిత్రం చేయడం అతి పెద్ద తప్పు అందట. సినిమా మొదట ఒప్పుకున్న సమయంలో చెప్పినట్లుగా నా పాత్రను సినిమాలో దర్శకుడు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
వెంకీమామ చిత్రంలో ఆంటీగా నన్ను చూపించడంతో నాకు వచ్చే కొన్ని కొన్ని ఆఫర్లు కూడా పోయాయి. వెంకటేష్ వంటి సీనియర్ హీరోతో నటించిన తర్వాత చిన్న హీరోలు ఎవరు కూడా నాతో నటించేందుకు ఆసక్తి చూపడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అందుకే ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా ఓకే చెబుతూ వస్తోంది. తాజాగా మరో సీనియర్ హీరో బాలకృష్ణతో కూడా నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
వెంకీమామ చిత్రంలో నటించకుంటే యంగ్ హీరోతో నటించే అవకాశాలు వరుసగా వచ్చేవని ఈమె అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. వెంకీమామ కారణంగా కెరీర్ నాశనం అయ్యిందని పాయల్ ఆవేదన చెందుతోంది. తప్పు జరిగి పోయిన తర్వాత చేసేది ఏముంది. ఇప్పటి నుండి అయినా జాగ్రత్తగా ఉండు అంటూ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.
760595 862803You created some decent points there. I looked on the web for the problem and discovered most individuals will go coupled with along along with your web site. 550304
755832 727363The digital cigarette makes use of a battery and a small heating element the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 485356
245204 114594Wow, superb weblog layout! How long have you been running a blog for? 579934