Switch to English

జగన్ చేసింది కేసీఆర్ చేయలేరా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

మనసుంటే మార్గం ఉంటుందనేది నానుడి. ఏ పైనైనా కచ్చితంగా చేయాలని అని సంకల్పించుకుంటే అందుకు ఎలాంటి కారణాలూ అడ్డు రావు. తెలుగు రాష్ట్రాల సీఎంలు తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు నిదర్శనం. ముందుగా ఏపీ సంగతి చూద్దాం. తెలంగాణ ధనిక రాష్ట్రం కాగా, ఏపీ అప్పుల్లో కూరుకుపోయి విలవిలలాడుతోంది. ప్రతినెలా ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లకే ఇబ్బందులు పడుతోంది. ప్రతినెలా లోటు బడ్జెటే. అయినప్పటికీ పాదయాత్ర సందర్బంగా తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలనే సంకల్పంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు.

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. వాస్తవానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. ఇందుకు చాలా పెద్ద తతంగమే ఉంది. ఆ సాకూ చూపించి జగన్ తప్పించుకునే వీలుంది. కానీ ఆయన అలా చేయలేదు. ముందుగా ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశారు. అంటే.. ప్రభుత్వ ఉద్యోగికి ఉన్న సకల సౌకర్యాలూ వారికి వర్తింపజేశారు. ఆర్టీసీని ఎప్పటిలాగానే కొనసాగించారు. అలా అటు ఆర్టీసీ సిబ్బంది డిమాండ్ నెరవేర్చారు.

ఇక తెలంగాణ విషయానికొద్దాం. దేశంలోని ధనిక రాష్ట్రాల్లో ఒకటి. దేశాన్ని తామే సాకుతున్నామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే అసెంబ్లీలో ప్రకటించారు. ఆదాయపరంగా కూడా ముందంజలోనే ఉంది. ఒక్క మద్యం ద్వారానే నాలుగేళ్లలో ఏకంగా రూ.50వేల కోట్లు సంపాదించింది. ఇక రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఆదాయం గురించి చెప్పక్కర్లేదు. అందువల్ల ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం ఏమీ కష్టం కాదు. పైగా ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఊసెత్తితే విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వంలో విలీనం ముచ్చటే లేదంటున్నారు. సమ్మెకు దిగిన సిబ్బందిని తొలగిస్తామని హెచ్చరికలు జారీచేశారు. జగన్ సింపుల్ గా చేసిన పనిని కేసీఆర్ చేయకుండా పరిస్థితిని తారాస్థాయికి తీసుకెళ్లిపోయారు.

ఆర్టీసీ సిబ్బంది సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశం లేకపోవడం వల్లే ఇలా చేశారనే విమర్శలు వస్తున్నాయి. దాదాపు 50వేల కుటుంబాలను రోడ్డున పడేసేలా ఆయన తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సరైనది కాదని పలువురు బాహటంగానే చెబుతున్నారు. రాష్ట్రానికి పెద్దగా అందరి బాగోగులు చూడాల్సిన ఆయనే.. ఇలా కక్షసాధింపుగా వ్యవహరించడం సబబు కాదని పేర్కొంటున్నారు. తాను కోరుకున్న కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా ముందుకెళ్తున్న కేసీఆర్.. ఆర్టీసీ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...