Switch to English

బార్డర్ రగడ.. తప్పెవరిది?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీకి వెళ్లాలని ప్రయత్నించి రాష్ట్ర సరిహద్దులో చిక్కుకుపోయిన పలువురు ఏపీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే నరకాన్ని చవిచూశారు. అటు ముందుకెళ్లలేక, ఇటు వెనక్కి వచ్చి ఏం చేయాలో తెలియక పలువురు అక్కడే వేచిచూశారు. చివరకు తెలంగాణ పోలీసుల సహకారంతో పలువురు హైదరాబాద్ తిరిగొచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో తప్పు ఎవరిది అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ హాస్టళ్ల మూసివేత కారణంగా వేల సంఖ్యలో ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి బయలుదేరడం.. వారికి తెలంగాణ పోలీసులు నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వడం.. అవి పట్టుకుని ఏపీ సరిహద్దుకు చేరుకున్నవారిని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకోవడం.. విషయం రెండు రాష్ట్రాల సీఎంల వద్దకు వెళ్లడం.. వచ్చినవారిని క్వారంటైన్ కు తరలించేందుకు ఏపీ సర్కారు సిద్ధం కావడం.. దానికి కొంతమంది ససేమిరా అనడం.. ఎక్కడివారు అక్కడే ఉండాలని సీఎం జగన్ పేర్కొనడం.. చివరకు సహనం నశించిన పలువురు ఏపీ పోలీసులపై రాళ్లు రువ్వడం.. దీంతో వారు లాఠీచార్జి చేయడం వంటి పరిణామాలు ఇప్పటివరకు చోటుచేసుకున్నాయి.

ఏపీ సరిహద్దులో దాదాపు 24 గంటలపాటు పలువురు తిండీ తిప్పలు లేకుండా వేచి చూశారు. అయినప్పటికీ వారిని రాష్ట్రంలోకి అనుమతించే విషయంలో ఏపీ కఠినంగా వ్యవహరించింది. క్వారంటైన్ కు సిద్ధపడినవారందరినీ రాష్ట్రంలోకి అనుమతిస్తామని తేల్చిచెప్పింది. అయితే, పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలను లేనివారిని ఇంటికి వెళ్లడానికి అనుమతించాలని పలువురు కోరినా అధికారులు వినలేదు. అందరినీ 14 రోజుల క్వారంటైన్ కు తరలిస్తామని పేర్కొన్నారు.

వైరస్ వ్యాపించకుండా చూసేందుకు ఏపీ తీసుకున్న నిర్ణయం సబబే. లాక్ డౌన్ ఉద్దేశం కూడా అదే. అసలు హైదరాబాద్ నుంచి వారు ఏపీ వెళ్లడానికి తెలంగాణ పోలీసులు ఎన్వోసీ ఇచ్చి ఉండకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇచ్చినా.. ముందుగానే ఏపీ అధికారులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటే సరిపోయేది.

ఇదంతా అధికారుల మధ్య సమన్వయం లోపించడంతోనే జరిగిందని తెలుస్తోంది. దీంతో వెంటనే డీజీపీ స్పందించి ఎన్వోసీలు రద్దు చేసినట్టు ప్రకటించారు. ఇక తెలంగాణ పోలీసులు ఈ విషయంతో మానవత్వంతో స్పందించారు. బార్డర్లో చిక్కుకుపోయిన ఏపీవాసులకు అన్నపానీయాలు అందించి దాతృత్వం చాటుకున్నారు. వారిని ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్ తీసుకొచ్చారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...