ఛలో, భీష్మ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌ను దక్కించుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రస్తుతం ఒక డబ్బింగ్ సినిమాకు స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడట. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోసియుమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. సీతార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు.
ఈ సినిమాలో మొదట బాలకృష్ణ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వెంకటేష్ అంటూ ప్రచారం జరిగింది. కథానుసారంగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు నటించాల్సి ఉంది. ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి, పుకార్లు వస్తున్నాయి. ఆ విషయమై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు కాని ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించబోతున్నట్లుగా మాత్రం సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సీతార ఎంటర్టైన్మెంట్స్లో వెంకీ మరో సినిమా చేయాల్సి ఉంది. మహేష్‌బాబు పిలిపించుకుని కథ చెప్పించుకున్నా కూడా ప్రస్తుతానికి పరుశురామ్‌తో కంటిన్యూ అయ్యి ఆ తర్వాత చూద్దాం అన్నాడట. దాంతో ఈ గ్యాప్‌లో ఈ రీమేక్‌ను చేయాలనే నిర్ణయానికి వెంకీ వచ్చి ఉంటాడంటూ ప్రచారం జరుగుతోంది. వెంకీ కుడుముల రెండు సూపర్ హిట్స్ తర్వాత ఇలా రీమేక్‌పై దృష్టి పెట్టడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈయన కథ చెబుతాను అంటే పలువురు స్టార్స్ వినేందుకు సిద్దంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎందుకు వెంకీ తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాడు అంటున్నారు.
764953 743651The next time I just read a weblog, I genuinely hope which it doesnt disappoint me up to this one. Get real, Yes, it was my choice to read, but I personally thought youd have something interesting to convey. All I hear can be a handful of whining about something you could fix inside the event you werent too busy trying to uncover attention. 954091
87869 174556Enjoyed seeking at this, extremely great stuff, thanks . 832704
850078 254667You made some decent points there. I looked on the internet for the dilemma and discovered most individuals will go coupled with along together with your web site. 871734
324694 214752hi and thanks regarding the certain post ive actually been searching regarding this kind of info online for sum time these days hence thanks a great deal 64123