Switch to English

స్పెషల్ స్టోరీ: ‘భారత్‌ – చైనా’ యుద్ధమా.? ఎవరి బలమెంత.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయ్‌.! గాల్వాన్‌ లోయలో చైనా సైన్యం దాష్టీనికి పాల్పడటంతో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భారత సైన్యానికి మద్దతుగా వాయుసేన అప్రమత్తమయ్యింది. అత్యాధునిక యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. అయితే, ఇవన్నీ యుద్ధం కోసమేనని అనడానికి వీల్లేదు. ప్రధానంగా యుద్ధ విమానాల్ని అక్కడి మిలిటరీకి అండగా వుండేందుకు పంపిస్తారు. సరిహద్దుల్లో ప్రత్యర్థుల కుట్రల్ని ఈ యుద్ధ విమానాలు పసిగట్టి, సమాచారాన్ని నేల మీదున్న మిలిటరీ ఫోర్స్‌కి చేరవేస్తాయి. అదే సమయంలో, ప్రత్యర్థులు గనుక దాడికి యత్నిస్తే, యుద్ధ విమానాలు రంగంలోకి దిగి, తాము చెయ్యాల్సిన పనిని చేసేస్తాయి.

పాకిస్తాన్‌లో భారత్‌ జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ తీరు గమనిస్తే ఇది అర్థమవుతుంది. అయితే, పాకిస్తాన్‌ వేరు.. చైనా వేరు. చైనా ఆయుధ సంపత్తి చాలా చాలా ఎక్కువ పాకిస్తాన్‌తో పోల్చి చూసినప్పుడు. యుద్ధ ట్యాంకులు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు.. ఇలా చూసినా, భారత్‌ కంటే చైనాదే పై చేయి. అదే సమయంలో, చైనాతో యుద్ధం చేయాల్సి వస్తే.. భారత్‌ తన శక్తికి మించి సత్తా చాటగలదన్న విషయం డ్రాగన్‌ కంట్రీకి బాగా తెలుసు. ఒకప్పుడు చైనా చేతిలో భారత్‌ ఓడిపోయిన మాట వాస్తవం. కానీ, ఇప్పుడు యుద్ధం జరిగితే పరిస్థితులు ఇంకోలా వుంటాయి. ఆయుధాల లెక్కల పరంగా చైనా కంటే భారత్‌ కాస్త వెనకబడి వుండొచ్చుగాక.. కానీ, సామర్థ్యం విషయానికొస్తే.. చైనాని, భారత్‌ ధీటుగానే నిలువరించగలదన్నది నిర్వివాదాంశం.

‘గాల్వాన్‌ లోయ మాదే..’ అంటూ చైనా కొత్త వాదనకు తెరలేపింది. నిజానికి, గాల్వాన్‌ లోయ అనేది భారతదేశంలో అంతర్భాగం. ఆ మాటకొస్తే, ప్రస్తుతం అక్సాయ్‌ చిన్‌ ప్రాంతంగా పిలవబడుతున్న భాగం కూడా భారతదేశంలోనిదే. ఒక్క గాల్వాన్‌ లోయ విషయంలోనే కాదు, భారత్‌తో సరిహద్దు కలిగి వున్న ప్రాంతమంతటిలోనూ చైనా అలజడిని సృష్టించేందుకే ప్రయత్నిస్తోంది. ఇక్కడే దేశ నాయకత్వం మరింత అప్రమత్తంగా వుండాలి. ఆయుధ మోహరింపు ఓ వైపు, చైనాతో చర్చల యుద్ధం ఇంకో వైపు జరగాల్సిందే. అన్నిటికీ మించి, ప్రపంచం దృష్టికి చైనా తీరుని తీసుకెళ్ళాల్సిన బాధ్యత ప్రస్తుతం భారత ప్రభుత్వంపై వుంది. సబ్‌మెరైన్లు, మిస్సైళ్ళు, అత్యాధునిక యుద్ధ విమానాలు.. వీటన్నిటి అవసరం బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరు దేశాలకూ రాకపోవచ్చేమో. ఎందుకంటే, చైనాకి తెలుసు.. భారత్‌తో యుద్ధం జరిగితే ఏమవుతుందో. ఎటూ భారతదేశం తనంతట తానుగా యుద్ధం వైపు అత్యుత్సాహం చూపదనుకోండి.. అది వేరే విషయం. ప్రత్యర్థి తోక జాడిస్తే మాత్రం, సమాధానం చెప్పక తప్పదు కదా.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....