వాల్తేర్ వీరయ్య సినిమాను చిరు అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
ఒకానొక ఇంటర్వ్యూలో మీపై అప్పట్లో విషప్రయోగం జరిగిందిట నిజమేనా? అన్నప్పుడు చిరంజీవి చిన్నగా నవ్వి ఇందులో నిజం లేకపోలేదు. “మరణమృదంగం సమయంలో జరిగింది ఈ ఘటన. ఒక వ్యక్తి ఫ్యాన్ అని చెప్పి వచ్చి కేక్ కట్ చేయించాడు. చేతితోనే తినిపించబోయాడు. నేను వద్దని వారించినా బలవంతం చేసాడు. ఆ కేక్ నోట్లో పెట్టుకోగానే వెరైటీగా అనిపించింది. ఒక పొడిలాంటిదేదో జిగురుగా తగిలి వెంటనే పారేసాను. వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే నేను ఆ ప్రాంతం నుండి వచ్చిన వేరే ఫ్యాన్ తో సన్నిహితంగా ఉంటున్నా అని చెప్పి నాపై వశీకరణ మంత్రాన్ని ప్రయోగించిన పొడిని తీసుకొచ్చాడు. నేను అది విని సిల్లీగా అనిపించి వదిలేయమని చెప్పా. అంతే తప్ప విషప్రయోగం కాదు” అని క్లారిటీ ఇచ్చారు.
727521 539879hello!,I really like your writing so much! 384413