Switch to English

YS Jagan: రాజధాని విశాఖ.! ఎలా సాధ్యం వైఎస్ జగన్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

రాజధాని విశాఖ.! ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ.! రెండిట్లో ఏది నిజం.? ఎన్నికల తర్వాత విశాఖ కేంద్రంగా పరిపాలన చేస్తానని వైఎస్ జగన్ చెప్పేసుకున్నారు. గెలిస్తే కదా.? అన్న ప్రశ్నకు వైసీపీ నుంచి సరైన సమాధానమే రావడంలేదు.

ఇంతకీ, కర్నూలు సంగతేమైంది.? అని వైసీపీలోనే అయోమయం కనిపిస్తోంది.! అధినేత ఏదో చెప్పారు, దాన్ని కవర్ చేసుకోవాల్సిన దుస్థితి వైసీపీ శ్రేణులది. విజన్ విశాఖ.. అంటూ ఎన్నికల ముందర వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పబ్లిసిటీ స్టంట్ బెడిసికొట్టింది.

విశాఖలోనే కాపరం అంటూ.. కొన్ని రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా ఊదరగొట్టేస్తూ వచ్చారు వైఎస్ జగన్. కాపురానికి.. విశాఖ వెళ్ళేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మొహమాటపడుతున్నారు.? ఆయన్ని ఎవరు ఆపుతున్నారు.?

వైసీపీ చెబుతున్నదాన్ని బట్టి, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని.! రాజ్యాంగంలో రాజధాని గురించి ప్రత్యేక నిర్వచనం ఏమీ లేదు.. అని కూడా వైసీపీ అనడం చూశాం. అలాంటప్పుడు, విశాఖలో వైఎస్ జగన్ కాపురం పెట్టేసుకోవచ్చు కదా.?

నిన్న మొన్నటిదాకా ఏం జరిగిందో అనవసరం.! పోనీ, ఇప్పటికిప్పుడు అయినా విశాఖలో కాపురంపై కీలక నిర్ణయం తీసుకుని, రోజుల వ్యవధిలో విశాఖకు వెళ్ళిపోవచ్చు కదా.? కాదు కాదు, వెళ్ళరుట.! ఎన్నికలయ్యాకే వెళతారట.

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. చెప్పేటోడు వైఎస్ జగన్ అట.. అని విశాఖ వాసులే చర్చించుకుంటున్న పరిస్థితి. అసలంటూ విశాఖ ఎలా రాజధాని అవుతుంది.? ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, అమరావతే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని.

ఆ అమరావతి కోసం రైతులు భూములిచ్చారు, దానికి సంబంధించి ఒప్పందాలున్నాయి. దాన్ని ఏమార్చి, శాసన రాజధాని.. అని కొత్త పేరు పెడతామంటే కదురదు. ఓసారి చుక్కెదురయ్యింది.. మూడు రాజధానుల బిల్లు చిరిగిపోయింది. 151 సీట్లు వచ్చినప్పుడే సాధ్యం కాని మూడు రాజధానులు, అరకొర సీట్లతో అధికారంలోకి వస్తే జరుగుతుందా.?

అసలంటూ అధికారం వచ్చే పరిస్థితి లేదు.. పైగా, పదో పాతికో సీట్లు మాత్రమే వస్తాయన్న భయం వైసీపీ శ్రేణుల్లో వుంటే, ఈ రాజధాని పంచాయితీ ఒకటి మళ్ళీ.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...