Switch to English

ఒకే ఒక్క రాజధానికి ఓటేసిన వెంకయ్యనాయుడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,441FansLike
57,764FollowersFollow

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప, పరిపాలన వికేంద్రీకరణ సబబు కాదని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యల్ని రాజధాని కోణంలో చూడవద్దనీ ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాల్నీ సమదృష్టితో చూడాల్సి వుంటుందన్న వెంకయ్యనాయుడు, తాను కేంద్ర మంత్రిగా వున్నప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో జిల్లాకీ ఒక్కో జాతీయ సంస్థ వచ్చేలా కృషి చేశానని చెప్పారు.

సచివాలయం, శాసనసభ, హైకోర్టు.. ఇలా అన్నీ ఒకే చోట వుండడం అనేది పరిపాలనా సౌలభ్యం కోసమనీ, పాలన సులభతరం అయ్యే దిశగా ప్రభుత్వాలు ఒకే రాజధానికి కట్టుబడి వుంటే మంచిదని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయం అడిగితే ఖచ్చితంగా, ఒకే రాజధానికి ఓటేస్తానని తేల్చి చెప్పారు వెంకయ్య. దేశానికే ఒక్క రాజధాని వున్నప్పుడు, రాష్ట్రానికి మూడు రాజధానులన్న ఆలోచన అర్థం పర్థం లేని వ్యవహారమే.

నిజానికి, ఎప్పటినుంచో దేశంలో రెండో రాజధాని చర్చ జరుగుతున్నా, మేధావి వర్గం.. సామాన్యులు, మెజార్టీ రాజకీయ పార్టీలూ ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తోన్న విషయం విదితమే. కేవలం 13 జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల దిశగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోన్న దరిమిలా, మిగిలిన 10 జిల్లాల పరిస్థితేంటి.? అన్న వాదన ఆయా జిల్లాల నుంచి రావడం సహజమే.

విశాఖలో రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం వ్యతిరేకించదనీ, కర్నూలులో రాజధాని అంటే రాయలసీమ సమర్థిస్తుందనీ, అమరావతిలో ఎటూ రాజధాని కొనసాగుతుంది గనుక.. అక్కడ సమస్య లేదనీ అధికార పక్షం బుకాయింపులకు దిగితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

రాజధాని రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు, రాజధాని అమరావతి కోసం పోరాడుతున్న రైతుల్ని, ప్రజల్ని ఉద్దేశించి ఎంత చిన్న చూపు ప్రదర్శిస్తున్నారో చూస్తూనే వున్నాం. రాయలసీమ నుంచీ ఇదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రమంతా అమరావతిని రాజధానిగా అంగీకరించాక, మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టడం అధికార పార్టీకి భావ్యం కాదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...