Switch to English

వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్: స్టార్ కిడ్ టు సక్సెస్ ఫుల్ హీరో ‘వరుణ్ తేజ్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

సినిమా, రాజకీయం, వ్యాపారం.. రంగం ఏదైనా కావాల్సింది ప్రతిభ. ఆలోచన, తెలివి, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం లేకపోతే ఘనమైన వారసత్వం కూడా నిష్ఫలమే. ముఖ్యంగా సినీ రంగంలో మరీ ఎక్కువ. ఇక్కడ ప్రతి వారం రాతలు మారతాయి. నిలదక్కుకోవాలంటే తాము రాణించి ప్రేక్షకులను గెలవడం చాలా ముఖ్యం. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే వారికి తొలి సినిమా వరకూ ఘనమైన గుర్తింపే దక్కుతుంది. కానీ.. రెండో సినిమా నుంచి వారే నిరూపించుకోవాలి. అంచనాలు అందుకోవాలి. ప్రేక్షకుల్ని మెప్పించాలి. అప్పుడే కెరీర్ ముందుకెళ్తుంది. దీనిని సాధించిన మెగా హీరో వరుణ్ తేజ్. నాగబాబు తనయుడిగా మెగాస్టార్ చిరంజీవి, మెగాభిమానుల అండదండలు పుష్కలంగా ఉన్న వరుణ్ తన టాలెంట్ తో కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తున్నాడు. నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు.

మెగా వారసత్వం..

మెగా హీరో తొలి సినిమా అంటే భారీగా ఉండాల్సిందే. కానీ.. ఇందుకు విభిన్నంగా కెరీర్ ప్రారంభించాడు వరుణ్. సాఫ్ట్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫలితమెలా ఉన్నా తన లుక్స్ తో ఆకట్టుకున్నాడు. కంచె సినిమా వరుణ్ ఆలోచనా సరళికి నిదర్శనమని చెప్పాలి. దశాబ్దాల క్రితం నాటి యుద్ధ నేపథ్యం, ప్రేమ భావోద్వేగాల కథలో తన ప్రతిభను కనబరచి భవిష్యత్తు సినీ ప్రయాణాన్ని మార్గం ఏర్పరచుకున్నాడు. సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. మెగా హీరో అంటే మాస్, యాక్షన్ అని కాకుండా తొలి అడుగులతోనే నటనపై తనకున్న పట్టు చూపించాడు. కథా బలమున్న పాత్రల్లో వరుణ్ తేజ్ మెప్పించి మెగా వారసత్వాన్ని ఘనంగా చాటాడు. తొలిప్రేమ, ఫిదా సినిమాల్లో తన నటనతో మెప్పించాడు. అంతరిక్షం వంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. క్యారెక్టర్ ఏదైనా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు వరుణ్.

తండ్రి పేరు నిలబెట్టేలా..

ఇవే కాకుండా ఎఫ్-2, ఎఫ్-3 సినిమాల్లో కామెడీ పండించాడు. ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని పంచాడు. గద్దలకొండ గణేశ్ సినిమాలో ఊర మాస్ పాత్రలో నటించి పాత్ర ఏదైనా తనలోని నటన అంతే ధీటుగా వస్తుందని నిరూపించాడు. పాత్ర కోసం ఎంతైనా కష్టపడగలనని గని సినిమాతో నిరూపించాడు. ఇలా.. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా కూడా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటున్నాడు వరుణ్ తేజ్. తండ్రి నాగబాబు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రి గర్వించే స్థాయిలో వరుణ్ నిలబడి పుత్రోత్సాహాన్ని నింపుతున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన 12వ సినిమాగా యాక్షన్ డైరక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. భవిష్యత్తులో వరుణ్ తేజ్ విభిన్నమైన కథాంశాలతో మెప్పించి మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటోంది ‘తెలుగు బులెటిన్’.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...