తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు తమిళ తంబీలు పట్టం కడుతున్నారు. అయితే రొటీన్ రొట్ట కొట్టుడు సబ్జెక్ట్ అయినా, తమిళవాళ్లకి విజయ్ మీద ఉన్న అభిమానంతో ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించారు.
అయితే తెలుగులో మాత్రం ‘వారసుడు’ సినిమాకు అంతంతమాత్రం రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రావడంతో ఇక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. దీంతో ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
ఈ సినిమాపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాత్రం మొదట్నుండీ రేంజ్లో అంచనాలు పెంచుతూ వచ్చాడు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో టాలీవుడ్ నిర్మాతలతో దిల్ రాజు ఓ చిన్నసైజ్ యుద్ధం కూడా చేశాడు. కానీ, ఇప్పుడు అదంతా బూడిదల పసని పన్నీరుగా మిగిలింది. ఈ సినిమా టాలీవుడ్లో యావరేజ్ మూవీగా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న దిల్ రాజుకి ఓ భారీ డిజాస్టర్ మిగలనుందని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఏదేమైనా, ఇలాంటి ఓవర్ కాన్ఫిడెంట్ ఏమాత్రం మంచిది కాదని పలువురు అంటున్నారు.
696646 231197I was examining some of your content material on this internet internet site and I believe this site is rattling instructive! Keep putting up. 891660
440674 260446a good deal lately with my father so hopefully this will get him to see my point of view. Fingers crossed! mortgage banker new york 773466
937143 322242The excellent intreguing articles keep me coming back here time and time once more. thank you so considerably. 942895