ఫోర్జరీ ఆరోపణలు: టీవీ 9 రవిప్రకాష్‌ ఎక్కడ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,274FansLike
57,764FollowersFollow

ఓ సాధారణ జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి, ఓ పెద్ద మీడియా సంస్థకి అధిపతిగా మారిన రవిప్రకాష్‌, టీవీ9 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితుడే. ఇటీవలే టీవీ9 సంస్థ నుంచి నేషనల్‌ న్యూస్‌ ఛానల్‌ కూడా బయటకొచ్చింది. అయితే, గత కొంతకాలంగా టీవీ9లో అంతర్గత విభేదాలంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది. టీవీ9 రవిప్రకాష్‌ చుట్టూ చాలా ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాజాగా రవిప్రకాష్‌పై నిధుల మళ్ళింపు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల టీవీ9 సంస్థలో పెద్దయెత్తున వాటాల్ని కొనుగోలు చేసి, సంస్థను టేకోవర్‌ చేసిన అలమంద మీడియా రవిప్రకాష్‌పై ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది.

ఏబీసీఎల్‌ కార్పొరేషన్‌ నుంచి 90 శాతం షేర్లను కొనుగోలు చేసిన అలమంద మీడియా, టీవీ9ని టేకోవర్‌ చేసింది. యాజమాన్యం మారిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు టీవీ9 రవిప్రకాష్‌ని వివాదాల బోనెక్కించాయి. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు అన్వేషిస్తున్నారట. విదేశాల్లో టీవీ9 రవిప్రకాష్‌ వున్నారనీ, అన్ని సమస్యలూ త్వరలోనే పరిష్కారమవుతాయనీ మీడియా వర్గాల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే వివాదాలు రవిప్రకాష్‌కి కొత్తేమీ కాకపోయినా, ఈసారి ఆయనకు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని ఇంకొందరు అంటున్నారు.

టీవీ9 కార్యాలయం నుంచి విలువైన సమాచారం ‘దొంగతనానికి’ గురయ్యిందని, కొన్ని ముఖ్యమైన పత్రాలు ఫోర్జరీకి గురయ్యాయని కూడా ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. మామూలుగా అయితే మీడియా సంస్థల విషయంలో ఇలాంటి వ్యవహారాలు మరీ అంత పాపులర్‌ కావు. కానీ, తెలుగు నాట అత్యంత పాపులర్‌ అయిన మీడియా సంస్థ టీవీ9కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇలాంటి వివాదాల గురించి వింటూనే వున్నాం. పైకి చెప్పే నీతులకి, పాటించే విలువలకీ సంబంధమే వుండదని కొందరు అంటుంటారు. అయితే టీవీ9 ఎదుగుదల చూసి ఓర్వలేనివారు చేసే ఇలాంటి దుష్ప్రచారాలకు విలువ వుండదనే వాదన కూడా ఇంకో వైపునుంచి విన్పిస్తుంటుంది.

తెలంగాణ రాష్ట్ర సమితితో వివాదాల కారణంగా కొన్నాళ్ళపాటు టీవీ9 తెలంగాణలో అనధికారికంగా బ్యాన్‌కి గురైన సంగతి తెల్సిందే. పవన్‌కళ్యాణ్‌ విషయంలో శ్రీరెడ్డి ద్వారా అత్యుత్సాహం చూపినందుకు అప్పట్లో పవన్‌కళ్యాణ్‌ అభిమానులూ టీవీ9నీ ఆ ఛానల్‌ సీఈఓ రవిప్రకాష్‌నీ టార్గెట్‌ చేశారు. ఒకానొక సమయంలో రవిప్రకాష్‌పై పవన్‌కళ్యాణ్‌ కూడా వరుస ట్వీట్లు వేయడం అప్పట్లో పెద్ద సంచలనమే అయినా, ఆ తర్వాత ఆ వివాదం చల్లారింది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి వివాదాలెన్నో కన్పిస్తాయి ఆ సంస్థకు సంబంధించి.

ఏదిఏమైనా, రవిప్రకాష్‌ అజ్ఞాతంలోకి వెళ్ళారన్న ప్రచారం దరిమిలా, ఆయన మీడియా ముందుకొస్తే తప్ప ఈ ఊహాగానాలకు చెక్‌పడే అవకాశం లేదు. తాజా పరిణామాల గురించీ, కేసుల గురించీ టీవీ9 ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.

8 COMMENTS

సినిమా

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్...

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్...

రాజకీయం

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర పునర్నిర్మాణం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన...

ఎక్కువ చదివినవి

ఏపీ విద్యకు కొత్త దిశ: ప్రపంచానికి ఆంధ్ర మోడల్ చూపుదాం – లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగాన్ని బలోపేతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా “ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్”ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ‘ఉద్యమి’ సభ్యత్వానికి తొలి రోజే లక్ష స్పందన

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సమధికోత్సాహంతో ప్రారంభమైంది. మహాశివరాత్రి పర్వదినాన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. సభ్యత్వ...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....