తెలుగు బుల్లి తెరకు చెందిన వారిని కరోనా వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలుగు టీవీ రంగానికి చెందిన వారు పదుల సంఖ్యలో కరోనా బారిన పడ్డట్లుగా అనధికారిక సమాచారం. ఇటీవలే ఆమెకథ హీరోయిన్ నవ్య స్వామి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. తాజాగా ఆమె సోషల్ మీడియా లైవ్ లో తను కరోనాతో బాధపడుతున్నట్లుగా పేర్కొంది. తాజాగా ఆ సీరియల్ కే చెందిన హీరో రవికృష్ణ కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 తో మంచి పేరు దక్కించుకున్న రవికృష్ణ ప్రస్తుతం బుల్లి తెరపై పలు సీరియల్స్ మరియు షోల్లో కనిపిస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న ఆమె కథ షూటింగ్లో భాగంగా కరోనా అంటి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ నవ్యతో షూటింగ్లో పాల్గొన్న కారణంగానే ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చి ఉంటుందని బుల్లి తెర వర్గాల వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం హీరో హీరోయిన్‌కు మాత్రమే కాకుండా ఇంకా ఆమె కథకు చెందిన పలువురు యూనిట్ సభ్యులు కూడా కరోనా పాజిటివ్ బారిన పడ్డట్లుగా సమాచారం అందుతోంది. షూటింగ్స్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా బుల్లి తెరకు చెందిన వారికి ఇలా కరోనా సోకుతుందని అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ షూటింగ్స్‌కు బ్రేక్ పడే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
866163 267545Somebody necessarily aid to make seriously articles I might state. That is the really first time I frequented your internet page and to this point? I surprised with the research you created to make this actual put up amazing. Great task! 559504
225515 197760Really informative and superb bodily structure of content material , now thats user friendly (:. 17686
654006 753749Theres noticeably a bundle to locate out about this. I assume you produced certain very good points in capabilities also. 396588