Switch to English

పోలీసు శాఖ ఉరిమితే.. పిడుగు ‘బేబీ’ దర్శకుడి పై పడింది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

కొన్నాళ్ల క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమాలో విలన్ ని హీరో కరెంట్ షాక్ పెట్టి చంపుతాడు. అంటే సదరు సినిమా దర్శకుడు కరెంట్ షాక్ పెట్టి ఎలా చంపాలో జనాలకు నేర్పించినట్లా?.. ఇంకో సినిమాలో విలన్ తాలూకా ఆకు రౌడీలను హీరో ఎడాపెడా నరుక్కుంటూ పోతాడు. దాని అర్థం ఎలా నరకాలో ఆ ప్రేక్షకులకు డైరెక్టర్ డెమో ఇచ్చినట్లా?. సినిమాల్లో డ్రగ్స్ తీసుకునే సీన్లు పెట్టడం నేరమే అయితే పైన చెప్పుకున్న రెండు ఉదాహరణలు కూడా నేరం చేయడానికి ప్రేరేపించేవనే కదా అర్థం. సినిమాలో చూపించిన సీన్లు సొసైటీ మీద ప్రభావం చూపుతాయా? అన్న విషయం పక్కన పెడితే.. అసలు సమస్య రేవ్ పార్టీలు, పబ్బుల ద్వారా వస్తుంటే సినిమాలో ఉండే సీన్లపై అభ్యంతరం చెప్పడం ఎంతవరకు సబబు? అనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. కారణం.. హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగుతోంది. పోలీసు శాఖ ఇప్పటికే డ్రగ్స్ కేసులో పలువురిని అరెస్టు చేయగా.. కొంతమంది ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. అందులో రీసెంట్ హిట్ మూవీ ‘బేబీ’ సినిమా దర్శకుడు రాజేష్ కూడా ఒకరు. ఆ సినిమాలో డ్రగ్స్ తీసుకునే సీన్లు చూపించడంపై వివరణ ఇవ్వాలంటూ రాజేష్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

పోలీసుల తీరుపై కొందరు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమాలో డ్రగ్స్ సీన్లు అంత అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ బోర్డ్ ఎందుకు కత్తిరించనట్లు?. సెన్సార్ వాళ్ళకి అవి తప్పనిపించలేదా?. అయినా ఆ సినిమా విడుదలై థియేటర్లలో ఆడి.. ఓటీటీలో కూడా పాతబడిపోయింది. ఆ సినిమాపై చర్యలు తీసుకోవాలనుకుంటే రిలీజ్ అయిన వెంటనే ఎందుకు స్పందించలేదు?. కనీసం ఓటీటీలో విడుదలయ్యేటప్పుడైనా అభ్యంతరం చెప్పుంటే ఆ సీన్లకు కత్తెరపడేది కదా!. థియేటర్లలో ఆడి.. ఓటీటీలోనూ అందరూ చూసేశాక ఇప్పుడు చర్యలు తీసుకుని ఏం లాభం? కొద్ది రోజుల్లో ఆ సినిమా ప్రీమియర్ ను టీవీల్లో కూడా వేయునున్నారు. సాధారణంగా టీవీ ప్రేక్షకుల్లో ఎక్కువ భాగం మహిళలు, మధ్య వయసు ఉన్నవాళ్లే. యువత తప్ప ఈ సినిమాని టీవీలో చూడడానికి వాళ్ళు అంతగా ఆసక్తి చూపించరు. మరి ఇప్పుడు ఆ దర్శకుడు వివరణ ఇచ్చి చేసేదేముంది?. అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

అయినా.. డ్రగ్స్ తీసుకునే వాళ్లు బానిసలవుతారు తప్ప చట్ట ప్రకారం నేరస్థులు ఎలా అవుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొన్నామధ్య ఓ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు చీడని ఓ చోట పెట్టుకొని మందు మరోచోట వేయాలనుకోవడం ఏంటి?. అసలు పట్టుకోవాల్సింది,శిక్షించాల్సింది డ్రగ్స్ నెట్వర్క్ ని కదా. డ్రగ్ సప్లయర్స్, పెడలర్స్ ని వదిలేసి ఇలా సినిమాలో చూపించిన సీన్లపై అభ్యంతరం చెప్పడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పరిణామాలపై టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...