Switch to English

పచ్చి దగా: పోలవరం ప్రాజెక్టుకి ‘గులాబీ’ చెద?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయమై నానా రచ్చా జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అసెంబ్లీలోనే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు గురించిన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని ఒప్పించినట్లూ చెప్పారు. మామూలుగా అయితే, కేసీఆర్‌ ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేయడం కొత్తేమీ కాదని చాలామంది అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్‌ జగన్‌, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుని ఒప్పుకోరని చెబుతున్నారు.

అయితే, తాజాగా ఓ ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉన్నత విద్యావంతుడు, రాజకీయ విశ్లేషకుడు, కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడైన ప్రకాష్‌ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాల్సిందేనని తేల్చేశారాయన. అంతే కాదు, తగ్గించే ఉద్దేశ్యం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లేకపోతే, తదుపరి ఎలాంటి ఉద్యమం చేయాలో తమకు తెలుసని స్పష్టం చేశారు ప్రకాష్‌.

పైగా, ‘2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కూడా లేని కాటన్‌ బ్యారేజ్‌తోనే ఉభయ గోదావరి జిల్లాలు పచ్చని పంట పొలాలతో కళకళ్ళాడుతున్నాయి.. అక్కడివారు అమెరికా సహా ఇతర దేశాల్లో స్థిరపడుతున్నారు.. ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థానంలో అక్కడి ప్రజలున్నారు.. సినిమా షూటింగులు కూడా జరుగుతున్నాయి. అలాంటిది, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా 10 టీఎంసీల నీరు తగ్గితే నష్టమేంటి.? భద్రాచలం దేవాలయం మునిగిపోకూడదన్నదే మా ఆలోచన. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోనే వున్న ఒకప్పటి తెలంగాణ ప్రాంత భూ భాగంలోని ప్రజల గురించే మా ఆవేదన..’ అంటూ అసలు విషయాన్ని కుండ బద్దలు కొట్టేశారు ప్రకాష్‌.

పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టుల్ని ఆశ్రయించిన విషయం అందరికీ తెల్సిందే. కేసీఆర్‌తో ‘పోలవరం ప్రాజెక్టుకి గులాబీ చెద’ అంశాన్ని వైఎస్‌ జగన్‌ ప్రస్తావించి తీరాలి. గోదావరి జలాల్ని ఇరు రాష్ట్రాలూ పంచుకోవడం అన్నది వేరే చర్చ. పోలవరం ప్రాజెక్టు జోలికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి భుజస్కంధాల మీదనే వుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...