ఎప్పుడూ ఏడుస్తూనే కన్పిస్తుండే శివజ్యోతి, శివంగిలా విరుచుకుపడితే.. స్వతహాగా చంద్రముఖి అయిన శ్రీముఖి కూడా బెదిరిపోవాల్సిందే. ఆ విషయం తాజా ఎపిసోడ్‌తో స్పష్టమయ్యింది. ఇన్ని రోజుల బిగ్‌బాస్ ప్రయాణంలో శ్రీముఖి – శివజ్యోతి మధ్య గట్టిగా ‘వార్ ఆఫ్ వర్డ్స్’ నడిచిన పరిస్థితి రాలేదు. కానీ, బిగ్‌బాస్ ఆ అవకాశాన్ని నామినేషన్ల పర్వం ద్వారా తీసుకొచ్చాడు. శివజ్యోతి – శ్రీముఖి మధ్య పోటీ పెట్టాడు. ఒకరి తప్పుల్ని ఇంకొకరు ఎత్తి చూపుకునేలా నామినేషన్ ప్రక్రియని డిసైడ్ చేశాడు.
నిజానికి, తొలుత ఎవరి గొప్పలు వారు చెప్పుకోవడంతో ఈ ప్రక్రియ మొదలయ్యింది. కానీ, ఓ దశలో అదుపు తప్పింది. అవతలి వ్యక్తి బలహీనతల మీద దెబ్బకొట్టడం శ్రీముఖికి అలవాటు. ఇక్కడా ఆ పనే చేసిందామె. శివజ్యోతి ఎమోషన్ మీద శ్రీముఖి ‘పంచ్’ వేసేసరికి, ఒక్కసారిగా శివజ్యోతి శివంగిలా మారిపోయింది. శ్రీముఖిని కడిగి పారేసింది. శివజ్యోతి అలా రెచ్చిపోతోంటే, పులి లాంటి శ్రీముఖి పిల్లిలా మారిపోయింది. రోహిణి కాన్ఫిడెన్స్ కోల్పోవడానికి కారణం శ్రీముఖేనని తేల్చేసింది శివజ్యోతి.
మిగతా హౌస్‌మేట్స్ చాలా ప్లాన్‌డ్‌గా ఓటింగ్ చేశారు. చెరి సగం ఓట్లు వచ్చాయి ఇద్దరికీ. చివరగా మిగిలిన బాబా భాస్కర్ తన ఓటుని శివజ్యోతికి వేయడంతో, ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్‌కి నామినేట్ అయ్యింది శ్రీముఖి. మిరపకాయల దండని, శ్రీముఖి మెడలో వేసిన శివజ్యోతి, ఓ హగ్ ఇచ్చేసింది.
‘ఈ గొడవ తర్వాత కూడా ఇద్దరూ స్నేహంగా వుంటారా.?’ అన్న ప్రశ్నకు, ‘ఖచ్చితంగా వుంటాను, వుండేందుకు ప్రయత్నిస్తాను.. శ్రీముఖి సహకరించకపోతే, వదిలేస్తాను..’ అని శివజ్యోతి తేల్చేసింది. శ్రీముఖి విషయం అందరికీ తెలిసిందే.. ఎవరి మీదన్నా ‘కత్తి’గట్టిందంటే.. అంతే సంగతులు.
మరోపక్క, ఈ వారం తాను నామినేట్ అవుతానని వరుణ్, తన గ్రూప్ మేట్స్‌ని బతిమాలుకున్నాడు. వరుణ్ – రాహుల్ మధ్య డిస్కషన్ జరిగితే, ఇద్దరూ ఒకర్ని ఒకరు పొగుడుకున్నారు తప్ప, విమర్శించుకోలేదు. వితిక మాత్రం, రవికి గట్టిగా క్లాస్ తీసుకుంది. శివజ్యోతి, శ్రీముఖిని కడిగేసినట్లే నడిచింది వితిక – రవిల వ్యవహారం కూడా.
చివర్లో పునర్నవి – బాబా భాస్కర్ మధ్య మరీ అంత హాట్‌గా ఏమీ డిస్కషన్ నడవలేదు. బాబా భాస్కర్ నామినేట్ అయ్యాడు. మొత్తంగా రవి, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. సో, రవికృష్ణ ఎలిమినేషన్ దాదాపు ఖాయమే కావొచ్చు. ఇదిలా వుంటే, రాహుల్ సిప్లిగంజ్ ఫేక్ ఎలిమినేషన్ అనంతరం సీక్రెట్ రూమ్‌కి వెళ్ళినా, ఎట్టకేలకు అతనికి విముక్తి కలిగింది. బిగ్ హౌస లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు.. పునర్నవి ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది.
