మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత చిత్రం అల వైకుంఠపురములో విడుదలై నాలుగేళ్లు అవుతోంది. వచ్చే సంక్రాంతి మహేష్ బాబు తో గుంటూరు కారంతో వస్తున్నాడు త్రివిక్రమ్. నిజానికి ఈ సినిమా కూడా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే విడుదలవ్వాలి కానీ ఎన్నో అనుకోని అవాంతరాల వలన వాయిదా పడుతూ వచ్చి చివరికి సంక్రాంతికి సెటిల్ అయింది.
గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలి త్రివిక్రమ్. ప్రస్తుతం బన్నీ పుష్ప2 తో బిజీగా ఉన్నాడు. 2024 సెకండ్ హాఫ్ కు కానీ పుష్ప 2 విడుదల కాదు. అంటే ఎంతలేదన్నా 2024 చివరికి కానీ త్రివిక్రమ్ సినిమాకు డేట్స్ ఇవ్వలేడు బన్నీ.
సో, ఈలోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ న్యాచురల్ స్టార్ నానితో ఒక సాఫ్ట్ ఎంటర్టైనర్ తీస్తాడని వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య నితిన్ తో అ…ఆ చేసి బ్లాక్ బస్టర్ సాధించాడు మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్ రచనకు నాని న్యాచురల్ పెర్ఫార్మన్స్ తోడైతే ఆ మజానే వేరు.