తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుత చిత్రాలను రూపొందించిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు నిర్మాతగా మారి తన ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై శాంతి నివాసం సీరియల్ తో ప్రముఖ దర్శకుడు రాజమౌళిని పరిచయం చేశారు. ఇప్పుడు అదే బ్యానర్ 25 వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రాఘవేంద్ర రావు మొదటిసారి చిత్ర నిర్మాణం చేపట్టి ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘‘సర్కారు నౌకరి’’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భావనా వళపండల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ లో చూపించిన మూవీ మేకింగ్ చూస్తే నిర్మాతగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్లెజంట్ మూవీగా ‘‘సర్కారు నౌకరి’’ ని రూపొందించారు దర్శకుడు గంగనమోని శేఖర్. ప్రస్తుతం తుది దశ పనుల్లో ఉన్న ‘‘సర్కారు నౌకరి’’ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో ఆకాష్, భావనా వళపండల్, తనికెళ్ల భరణి, మహాదేవ్, మధులత, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన,రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Fantastic blog you have here but I was curious about if you
knew of any message boards that cover the same topics discussed in this article?
I’d really like to be a part of group where
I can get feedback from other experienced people that share the same interest.
If you have any suggestions, please let me know.
Many thanks!
This information is priceless. When can I find out more?