ఏపీలో రాజకీయాలు దారుణంగా దిగజారిపోయాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల తిట్లు, దూషణలు పతాక స్థాయికి చేరిపోగా.. తాజాగా డిజిటల్ వార్ కూడా అదే బాటలో పయనిస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు తావిస్తోంది.
వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీ చేస్తున్న ప్రచారం.. మరీ శృతి మించిపోయింది. జగన్ పై పోరుకు బూతు ఖాతాలను సైతం టీడీపీ వినియోగించుకుంటోంది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేయడం సహజం. ఇందులో తప్పుపట్టేది ఏమీ ఉండదు. ప్రభుత్వం సరిగా పనిచేయాలంటే ప్రతిపక్షం కొరడా ఝులిపించాల్సిందే. కానీ ఆ విమర్శలు, ఆరోపణలు హుందాగా ఉండాలి. అవి వ్యక్తీకరించే వేదికలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి.
కానీ జగన్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ విలువలకు తిలోదకాలిచ్చేసింది. ‘ఆరు నెలల విఫల సీఎం జగన్’ అనే హ్యాట్ ట్యాగ్ ను విపరీతంగా ట్రెండింగ్ చేసే ఉద్దేశంతో పోర్న్ సైట్లను కూడా ఎడాపెడా వినియోగించుకుంటోంది. మూమాలు సైట్ల కంటే బూతు సైట్లకు వ్యూయర్స్ ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతోనే ఏమో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు పోర్న్ సైట్లలో ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేసింది. టీడీపీ చేసిన పనికి నెటిజన్లలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హ్యాష్ ట్యాగ్ ను ట్రిండింగ్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉండగా.. ఇలా పోర్న్ సైట్ల ద్వారా ఆ పని చేయడం ఏమీ బాగోలేదని పలువురు పేర్కొంటున్నారు. ఎంతో హూందాగా వ్యవహరించాల్సిన పార్టీ.. ఇలాంటి చౌకబారు ప్రచారం చేయడం సరికాదని అంటున్నారు. మొత్తానికి బూతులు తిట్టుకోవడం దగ్గర నుంచి బూతు సైట్లలో ప్రచారం వరకు ఏపీ రాజకీయాలు దారుణంగా దిగజారిపోయాయని ప్రజాస్వామ్యవాదులు నిట్టూర్పులు విడుస్తున్నారు.
447847 243042Yeah bookmaking this wasnt a risky determination outstanding post! . 58838
503099 906596I take fantastic pleasure in reading articles with quality content material. This write-up is 1 such writing that I can appreciate. Keep up the very good function. 643477