Switch to English

జూన్‌ నుండి షూటింగ్స్‌కు అనుమతి : తలసాని

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో అన్ని వర్గాల వారు, అన్ని రకాల పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితం అవుతున్న విషయం తెల్సిందే. కరోనా విపత్తు నేపథ్యంలో ప్రతి ఒక్కరు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు వారికి ఏదో ఒకరకంగా సాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వంతో పాటు స్వచ్చంద సంస్థలు మరియు ఎన్జీఓస్‌ కూడా ఈ సమయంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. సినిమా పరిశ్రమలో కొన్ని వేల మంది సినీ కార్మికులు షూటింగ్స్‌ లేకపోవడంతో తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. గత రెండు నెలలుగా షూటింగ్స్‌ పూర్తిగా బంద్‌ అయ్యాయి.

దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌లో సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి షూటింగ్స్‌కు అనుమతించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా సినీ వర్గాల వారితో కలిసి మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జూన్‌ నుండి షూటింగ్స్‌ కు అనుమతించే అవకాశం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ ఒక ప్రాంతం, ఒక నగరం అని కాకుండా ప్రపంచం మొత్తంను ఇబ్బంది పెడుతోంది. తెలుగు సినిమా పరిశ్రమపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. చిత్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది జీవనం సాగిస్తున్నారు. షూటింగ్స్‌లో పాల్గొనే కార్మికులు, థియేటర్లలో పని చేసే ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తు కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి ప్రభుత్వం సాధ్యం అయినంత వరకు సాయం చేసింది. కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే సాయంను అందించాం.

నేడు జరుగబోతున్న క్యాబినేట్‌ మీటింగ్‌లో కూడా సినిమా పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చిస్తాం. షూటింగ్స్‌ విషయమై ఒక నిర్ణయం తీసుకుంటాం. చిత్ర పరిశ్రమ మొత్తం ఏకం అయ్యి సీసీసీ ఏర్పాటు చేసి సినీ కార్మికులకు మద్దతుగా నిలవడం అభినందనీయం. ఇప్పటి వరకు సీసీసీ 14 వేల మందికి నిత్యావసరాలు అందించినట్లుగా వారు చెప్పారు. చిత్ర పరిశ్రమకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది.

తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినా కూడా హైదరాబాద్‌లో తెలుగు సినిమా పరిశ్రమ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగడంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. తెలుగు సినిమా పరిశ్రమను మరింతగా అభివృద్ది చేసే ఉద్దేశ్యంతో చిరంజీవి, నాగార్జున గార్లతో ఇప్పటికే మూడు సార్లు భేటీ అయ్యాం. ఈ సమయంలోనే కరోనా రావడంతో కొత్త పాలసీలను తీసుకు రాలేక పోయాం.

కరోనా పోయాక అయినా కొత్త పాలసీలతో మీ ముందుకు వస్తాం. లాక్‌ డౌన్‌ తర్వాత మరోసారి సినీ ప్రముఖులతో భేటీ అయ్యి ఇండస్ట్రీకి ఏం చేయాలనే విషయమై చర్చిస్తామని తలసాని అన్నారు.

లాక్‌ డౌన్‌ తర్వాత థియేటర్ల ఓపెన్‌ విషయమై నిర్మాతలతో చర్చిస్తాం. సామాజిక దూరం పాటించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం.

నిర్మాతలు తీసుకున్న బ్యాంకు లోన్లపై మారటోరియం విషయంలో బ్యాంకర్లతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోలేం, ఇప్పుడే అనుమతులు ఇవ్వలేం.

షూటింగ్స్‌ కోసం మరో నెల రోజులు ఓపిక పట్టండి. జూన్‌ నుండి అంతా సాదారణ స్థితికి వస్తే హ్యాపీగా షూటింగ్స్‌ చేసుకోవచ్చు.

సినిమా పరిశ్రమలో కార్మికుల కష్టాలు తాత్కాలికమే. మళ్లీ సినిమాల మేకింగ్‌ మొదలు అయితే వారు ఇబ్బందుల నుండి బయట పడతారంటూ తలసాని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

రోడ్డెక్కిన బస్సులు.. భయం భయంగానే ప్రయాణం.!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ముందుంది. తెలంగాణలో ఇప్పటికే బస్సులు రోడ్డెక్కగా, ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఛార్జీల పెంపు...

లైవ్ విజువల్స్: బెంగాల్, ఒడిశా, విశాఖలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అంపన్ తుఫాన్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొదలైన అంపన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ భీభత్సం నేడు విశాఖ తీరం మరియు కాకినాడ తీరప్రాంతాల్లోనూ దాడి చేయడం మొదలు...

చంద్రన్న ఛలో అమరావతి.. పార్టీ శ్రేణుల్లో ఏదీ ఆ ఉత్సాహం.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాదాపు రెండు నెలల విరామం తర్వాత అమరావతికి రానున్నారు. హైద్రాబాద్‌లోని తన ఇంటి నుంచి ఈ రోజు ఉదయమే బయల్దేరారాయన అమరావతికి రోడ్డు మార్గం ద్వారా....

‘పింజ్రాతోడ్‌’ యువతుల అరెస్ట్‌

గృహ హింసకు గురి అవుతున్న బాలికలను రక్షించి స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తున్న హోంకు తరలిస్తూ అందరి ధృష్టిని ఆకర్షించిన పింజ్రాతోడ్‌ సంస్థ నిర్వాహకులు అయిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్‌ చేయడం ప్రస్తుతం...

కరోనా అలర్ట్‌: ఇండియాలో లాక్‌డౌన్‌ అట్టర్‌ ఫ్లాప్‌.. అంతేనా.?

‘ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు నటించాయి.. ప్రజలు లాక్‌ డౌన్‌ పాటిస్తున్నట్లు నటించారు..’ అంటూ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా మీమ్స్ కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా తీవ్రతపై సెటైర్లు వేసుకునే సమయమా ఇది.?...