Switch to English

సడలింపులతో సమస్యలు తప్పవా?

దేశంలో కరోనా వైరస్ నిరోధానికి విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినా వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడలేదు. రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని సడలింపులు ప్రకటించింది. వలస కూలీల పాట్లు చూసిన తర్వాత వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతోనూ, ఆర్థిక వ్యవస్థను కాపాడే క్రమంలోనూ ఈ మేరకు వెసులుబాట్లు కల్పించింది. రాష్ట్రాలు వీటిపై తగిన నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. దీంతో పలు అంశాల్లో రాష్ట్రాలు కూడా సడలింపులు ఇస్తున్నాయి.

నిజం చెప్పాలంటే ఖాళీ కడుపులను నింపలేక సతమతమవుతున్న సర్కారులు.. ఈ విధంగానైనా వారికి ఉపాధి కల్పించాలని చూస్తున్నాయి. కానీ దానివల్ల తలెత్తే పరిణామాలను మాత్రం అంచనా వేయలేకపోతున్నాయి. లాక్ డౌన్ ఉంటేనే ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో దానిని ఎత్తేసినా.. సడలింపులు ఇచ్చినా పరిస్థితి మరీ భయంకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.

కష్టమో, నష్టమో ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కానందున మరికొంతకాలం సడలింపులు లేని లాక్ డౌన్ అమలు చేయాలని సూచిస్తున్నారు. కరోనా విషయంలో ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా లాక్ డౌన్ ఎత్తివేయొద్దు మొర్రో అని మొరపెట్టుకుంటోంది. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తే ఇప్పటివరకు పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనని చెబుతోంది.

ఆంక్షలు ఎత్తివేసినా, సడలింపులు ఇచ్చినా అగ్రరాజ్యం అమెరికా మరింత కుదేలు కావడం తాజాగా పరిశోధకులు హెచ్చరించారు. అలా చేస్తే ఆగస్టు నాటికి అక్కడ మరణాలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికాలో దాదాపు 12 లక్షల మందికి కరోనా సోకగా.. సుమారు 70 వేల మంది మృత్యువాత పడ్డారు.

అక్కడ ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలు ఈనెల రెండో వారంతో ముగియనున్నాయి. ఈ వేసవిలో వైరస్ మరింత విజృంభించే ప్రమాదం ఉందని, అదే సమయంలో ఆంక్షలు ఎత్తివేస్తే ఫలితం దారుణంగా ఉంటుందని వాషింగ్టన్ కు చెందిన హెల్త్ మెట్రిక్స్ ఎవాల్యుయేషన్ హెచ్చరించింది. ఆగస్టు నాటికి ఏకంగా లక్షా 40వేల మంది చనిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికాలోనే కాదు.. వైరస్ విజృంభిస్తున్న భారత్ వంటి దేశాల్లో సైతం అత్యంత జాగ్రత్తతో ఉండాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. సడలింపులు ఇచ్చే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని చెబుతున్నారు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

క్రైమ్ న్యూస్: ఆపద సమయంలో ఆశ్రయం ఇస్తే మిత్రుడి భార్యను లేపుకు పోయాడు

మంచికి పోతె చెడు ఎదురవుతుందని అంటూ ఉంటారు. మనం ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటే అది మనకే చెడు అవుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం కేరళకు చెందిన ఒక...

కరోనా కష్ట కాలంలో వైసీపీ సంబరాలు సమంజసమా.?

కరోనా వైరస్‌ ముప్పు రోజురోజుకీ పెరుగుతోంది. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘ఏడాది పాలన’ సంబరాలకు సమాయత్తమవుతోంది. ఈ నెల 23 నుంచి వారం రోజులపాటు సంబరాల కోసం అటు ప్రభుత్వం...

బికినీతో కరోనా పేషంట్‌కు చికిత్స

ఈ కరోనా కారణంగా ఎన్నో కొత్త కొత్త విషయాలు, వింతలు చూడాల్సి వస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా డాక్లర్లు మరియు నర్సులపై ఆదారపడి ఉంటున్నారు. వారు లేకుంటే ఈ...

హ్యాపీ లేని నెస్ట్ మాకెందుకు?

ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నిర్మించి ఇచ్చే హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లపై కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో తాము అందులో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపించామని,...