బన్నీ ఇంకా అందులోనుంచి బయటకు రాలేదు.. పాపం సుకుమార్..

sukumar_alluarjun

అల వైకుంఠపురంలో ఇచ్చిన కిక్ తో బన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండస్ట్రీ హిట్ అందుకోవడంతో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ మూడ్ లోకి వెళ్ళిపోయాడు. ఫిబ్రవరి నుంచి సుకుమార్ సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నది. కానీ, ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరి నుంచి మార్చికి పోస్ట్ ఫోన్ చేశారట. అలా పోస్ట్ ఫోన్ చేయడం వెనుక కారణం ఏంటి అంటే ఎంజాయ్ మూడ్ లో ఉండటమే అని అంటున్నారు.

ఈ సినిమా డిసెంబర్ లోనే లాంఛనంగా ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచే షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. ఎందుకంటే సుకుమార్ సినిమాను చెక్కడం మొదలుపెడితే… పర్ఫెక్షన్ కోసం తీస్తూనే ఉంటారు. అందుకే అయన సినిమా కనీసం సంవత్సరం సమయం ఇవ్వాలి. సుకుమార్ సినిమా అంటే హిట్ అవుతుందే గ్యారెంటీ ఉంటుంది కాబట్టి ఆలస్యం అయినా పర్వాలేదని అనుకుంటారు. కానీ, ఇప్పుడు బన్నీ కూడా ఆలస్యం చేస్తుండటంతో సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉన్నది.

బన్నీ ఈ సినిమాతో పాటుగా ఐకాన్ సినిమా కూడా చేయాల్సి ఉన్నది. వరసగా సినిమాలు చేయాల్సి ఉన్నప్పటికీ … చాలా కాలం తరువాత సరైన హిట్ దొరకడంతో బన్నీ పార్టీ మూడ్ లోకి వెళ్లిపోయారు. మరలా అలాంటి హిట్ ఎప్పటికి వస్తుందో కదా మరి. అందుకే ఎంజాయ్ చేస్తున్నారు.

బన్నీ మార్చి నుంచి షూటింగ్ లో పాల్గొంటానని చెప్పడంతో ఫ్రెష్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. బ్రేక్ లేకుండా ఈ శాండిల్ వుడ్ మాఫియా స్టోరీని షూట్ చేయాలని అనుకుంటున్నారు. హైదరాబాద్, కేరళ, థాయిలాండ్ లో షూటింగ్ చేయబోతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.