రకుల్ తమ్ముడి కోసం రంగంలోకి స్టార్స్!

రకుల్ తమ్ముడి కోసం రంగంలోకి స్టార్స్!

కుమారులను, వారసులను హీరోలు చేయడం కోసం ఇండస్ట్రీలో ప్రముఖులు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటారు. ఫ్యామిలీ అండతో వచ్చిన హీరోలు కష్టపడి పైకొస్తే ప్రాబ్లమ్ లేదు. లేదంటే సన్ స్ట్రోక్ తప్పదు. సాధారణంగా హీరోయిన్లకు ఇటువంటి సన్ స్ట్రోక్స్, ఫ్యామిలీ స్ట్రోక్స్ తక్కువే. పెళ్లైన హీరోయిన్లు కొందరికి హస్బెండ్ స్ట్రోక్ తగిలింది. పెళ్లి కాని హీరోయిన్లకు ఇటువంటి స్ట్రోక్స్ అరుదు. కానీ, రకుల్ కి తప్పడం లేదు.

రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. గతంలో ఒక వెబ్ సిరీస్ ఏదో చేసినట్టు ఉన్నాడు. తెలుగులో ‘నిన్నే పెళ్లాడతా’ అని ఒక సినిమా చేశాడు. ఈ సినిమా ప్రచారం కోసం రంగంలోకి స్టార్స్ ని దింపే ప్రయత్నం చేస్తోంది రకుల్. తనకున్న పరిచయాలను ఫుల్లుగా వాడుకుంటోంది. ‘నిన్నే పెళ్లాడతా’ టైటిల్ లోగోను నాగార్జున ఆవిష్కరించారు.

నాగార్జునకు జోడీగా రకుల్ ‘మన్మథుడు 2’ నటించే టైమ్ లో టైటిల్ లోగో విడుదల చేయించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా చేయడం కూడా కలిసొచ్చింది. ప్రజెంట్ సిట్యువేషన్ కి వస్తే… సినిమా రిలీజ్ కి రెడీ అయింది. సినిమాలో ఫస్ట్ సాంగ్ ‘పొద్దున్నే లేస్తూనే’ ఆదివారం సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. దానిగురించి సోషల్ మీడియాలో రకుల్ పబ్లిసిటీ స్టార్ట్ చేసింది. రకుల్ క్లోజ్ ఫ్రెండ్ మంచు లక్ష్మి కూడా అమన్ కి విషెష్ చెప్తూ పోస్ట్ చేసింది. సినిమా రిలీజ్ టైమ్ కి స్టార్స్ ఎక్కువమంది పబ్లిసిటీ చేసే ఛాన్స్ ఉంది.