దేశరాజధాని హస్తినలో ఆక్సిజన్ కొరత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉండటం.. సరిపడా స్థాయిలో ఆక్సిజన్ అందకపోవడంతో ఆస్పత్రుల్లో వెంటిలేటర్ పై ఉన్న రోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఢిల్లీలోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఒకటైన సర్ గంగారామ్ ఆస్పత్రి లో మరోసారి ఆక్సిజన్ సంక్షోభం తలెత్తింది. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆస్పత్రి అధికారులు ప్రభుత్వానికి అత్యవసర సందేశం పంపించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు అయిపోయాయని.. ఇంకా కేవలం గంట వరకు మాత్రమే అది సరిపోతుందని చెప్పారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై ఒక ఆక్సిజన్ ట్యాంకర్ పంపించారు.
అది రెండు గంటల వరకు సరిపోతుందని ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి ఆ ఆస్పత్రికి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల కల్లా ఆక్సిజన్ రావాల్సి ఉంది. అయితే, సదరు సరఫరాదారుడు జాప్యం కారణంగా 4 గంటలకు వచ్చాయి. అవి దాదాపు 12 గంటలపాటు సరిపోతాయని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. రెండు రోజుల క్రితం ఇదే ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. వెంటనే అధికారులు అప్రమత్తమై ఆగమేఘాల మీద ఆక్సిజన్ పంపించారు. మరోసారి శనివారం రాత్రి అదే పరిస్థితి పునరావృతమైంది.
615465 694845We give you with a table of all of the emoticons that can be used on this application, and the meaning of each symbol. Though it might take some initial effort on your part, the skills garnered from regular and strategic use of social media will create a strong foundation to grow your business on ALL levels. 313626