Switch to English

“ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా ట్రైలర్ రిలీజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,801FansLike
57,764FollowersFollow

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా ఈ నెల 15వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

“ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా ట్రైలర్ రిలీజ్

ఈ సందర్భంగా నటుడు సంతోష్ యాదవ్ మాట్లాడుతూ – నేను ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటింది. ఇన్నేళ్ల కెరీర్ లో “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాతో నాకొక మంచి అవకాశం లభించింది. ఈ సినిమా నటుడిగా నన్ను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో శంకరన్న అనే క్యారెక్టర్ లో నటించాను. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా టీజర్ రిలీజైన తర్వాత నన్ను అందరూ శంకరన్న అని పిలవడం మొదలుపెట్టారు. ఇది ప్రతి ఒక్కరూ తమను తాము రిలేట్ చేసుకునే సినిమా అవుతుంది. అన్నారు.

“ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా ట్రైలర్ రిలీజ్

నిర్మాత డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు మాట్లాడుతూ – ఒక మంచి సినిమాతో మా సంస్థ లాంఛ్ అవుతుండటం హ్యాపీగా ఉంది. మా ప్రొడక్షన్ కు ఒక లాంగ్ రన్ ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ స్టెప్ “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా. మా మూవీని ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఏషియన్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ మా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికి 60 థియేటర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. మా టీమ్ కు సపోర్ట్ గా ఉన్న మామిడి హరికృష్ణ, మధుర శ్రీధర్ రెడ్డి గారికి థ్యాంక్స్. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాను మీరంతా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ – మంచి ప్రయత్నం చేసినప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయి. అలాంటి స్ట్రగుల్స్ ఎదురైనా తట్టుకుని మా ప్రొడ్యూసర్స్ ను సేఫ్ గా ఉంచుతూ ఈ సినిమాను కంప్లీట్ చేశాను. ఈ ప్రాసెస్ లో నాకు హీరో చైతన్య, హీరోయిన్ భూమి శెట్టి సపోర్ట్ గా నిలిచారు. వాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే ఈ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. నాకు అండగా నిలబడిన మామిడి హరికృష్ణ గారికి కృతజ్ఞతలు చెబుతున్నా. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా థియేట్రికల్ రిలీజ్ మంచి సంస్థల ద్వారా జరుగుతుండటం హ్యాపీగా ఉంది. సినిమా అనేది ఆర్ట్ బిజినెస్. ఇందులో మంచి పాయింట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మిమ్మల్ని ఎంగేజ్ చేసేలా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా ఉంటుంది. ఈ నెల 15న థియేటర్స్ కు రండి. తప్పకుండా మా మూవీ మీకు నచ్చుతుంది. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఇందులో మీకు ఇబ్బందికరమైన సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండవు. అన్నారు.

హీరోయిన్ భూమి శెట్టి మాట్లాడుతూ – “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” ఒక న్యూ ఏజ్ సినిమా. ఈ సినిమా చేసిన మేకర్స్, నటించిన ఆర్టిస్ట్స్ అందరూ యంగ్ టాలెంట్స్. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం మాలాంటి వాళ్లకు వస్తుంది. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేయండి. తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలని కోరుతున్నా. ఇదొక మంచి మూవీ. కరీంనగర్ నేపథ్యంలో చేశాం. నేను తెలంగాణ యాస నేర్చుకుని డైలాగ్స్ చెప్పాను. అందుకు మా హీరో చైతన్య సపోర్ట్ చేశారు. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” ఈ నెల 15న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. తప్పకుండా చూడండి. అన్నారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే మిగతా వారికి షేర్ చేయండి. మీరొక మంచి సినిమా సజెస్ట్ చేశారని వారు భావిస్తారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ల జీవితాల్లో ఉండే సంతోషాలు, బాధలు, అన్ని ఎమోషన్స్ ఈ కథలో ఉంటాయి. మన మధ్య జరుగుతున్న కథలా ఉంటుంది. పూర్తిగా కమర్షియల్ సినిమా ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్ లో ఒక మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ చేసేందుకు మనసు ఉండాలి. అలాంటి మంచి మనసున్న ప్రొడ్యూసర్స్ నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ మాకు దొరికినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాం. కుమారస్వామి మంచి డైరెక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు నన్ను దగ్గర చేస్తుందని ఆశిస్తున్నాను. విజయశాంతి క్యారెక్టర్ లో భూమి శెట్టి బాగా నటించింది. తెలుగులో ఆమెకు మరిన్ని ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నా. నేను చిరంజీవి క్యారెక్టర్ లో, భూమి శెట్టి విజయశాంతి అనే క్యారెక్టర్ లో నటించాం. 80లో క్రేజ్ ఉన్న ఆ పెయిర్ కు ట్రిబ్యూట్ గా మా క్యారెక్టర్స్ కు ఆ పేర్లు పెట్టారు డైరెక్టర్ గారు. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా ఈ నెల 15న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

సినిమా

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే...

సారంగపాణి నుంచి తెల్లా తెల్లారినాదో సాంగ్ రిలీజ్..!

స్టార్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తూ వస్తున్న ప్రియదర్శి కమెడియన్ గా తన మార్క్ చాటుతున్నాడు. మరోపక్క మల్లేశం, బలగం, 35, కోర్ట్ లాంటి...

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

వైసీపీ అనుకూల వర్గాలు.. జనసేన ఖాతాలోకి..?

ఏపీ రాజకీయాల్లో జనసేన జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. కచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి ఇంకా బలమైన శక్తిగా మారాలని చూస్తోంది. ముఖ్యంగా కొన్ని వర్గాలను జనసేనకు కంచుకోటగా మార్చుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 19 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 19-04-2025, శనివారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు. తిథి: బహుళ షష్ఠి మ. 1.55 వరకు,...

అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు : పవన్ కల్యాణ్‌

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు నేడు. 75వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పెషల్ గా విషెస్ తెలిపారు. 'అనితర సాధ్యుడు...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు...

అల్లు అర్జున్, శ్రీలీలపై కేసులు నమోదు చేయాలి.. స్టూడెంట్స్ యూనియన్ల డిమాండ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, శ్రీలీల చిక్కుల్లో పడ్డారు. వీరిపై కేసులు నమోదు చేయాలంటూ స్టూడెంట్స్ యూనియన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు కొన్ని సంస్థలు, కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా...