రామ్ గోపాల్ వర్మ, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తోన్న సంగతి తెల్సిందే. ఓ సినిమా చేస్తూ, ఆ సినిమా పబ్లిసిటీ కోసం ఇంకొన్ని సినిమా టైటిల్స్‌ని వదలడం వర్మకి అలవాటు. అలా వచ్చే పబ్లిసిటీతోనే వర్మ, కాలం నెట్టుకొచ్చేస్తున్నాడు. వివాదాలే వర్మకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడ్తాయి. అందుకే, వివాదాల కోసం వర్మ ఏం చేయడానికైనా వెనుకాడడు. తాజాగా వర్మ, ‘మెగా ఫ్యామిలీ’ పేరుతో సినిమా తీస్తానని ప్రకటించాడు. అంతలోనే, ఆ ప్రయత్నం విరమించుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఏమయ్యింది ఈ మధ్యలో.? పది గంటల సమయంలో వర్మ, తనను తాను మార్చుకున్నాడు. మెగా ఫ్యామిలీ అంటే 39 మంది పిల్లలుంటారట. కానీ, అంతమంది పిల్లలున్న ‘పిల్లల’ సినిమా తాను తీయలేనంటూ వర్మ చేతులెత్తేశాడు. అవును, వర్మ ‘చిన్న పిల్లల’ సినిమాలు తీయలేడు. అదే, మియా మల్కోవా లాంటి పోర్న్ స్టార్స్‌తో అడల్ట్ సినిమాలు తీయమంటే మాత్రం ఎగిరి గంతేస్తాడని నెటిజన్లు వర్మ మీద సెటైర్లు సంధిస్తున్నారు.
గతంలో మియా మల్కోవాతో ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ పేరుతో ఓ వీడియో వర్మ రూపొందించడం, అది వివాదాస్పదం తెలిసిన సంగతే. ఓ యంగ్ అప్‌కమింగ్ టాలెంటెడ్ డైరెక్టర్ దగ్గర్నుంచి కథని దొబ్బేసి, దానికి బూతుని అద్ది వర్మ ఆ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ తెరకెక్కించాడని అప్పట్లో విమర్శలొచ్చాయి. బాధిత వ్యక్తి ఎంతగా గగ్గోలు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందనుకోండి. అది వేరే సంగతి.
310774 927476Really clean internet site , thanks for this post. 128835
854150 258584extremely excellent put up, i in fact love this internet site, keep on it 945482
129382 564172This web site is my inhalation, actually great layout and Perfect written content material. 918133
346411 598063Theres noticeably a bundle to uncover out about this. I assume you made certain excellent points in capabilities also. 870866