మరో పది రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 150 రోజుల పాలనను పూర్తి చేసుకోబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టారు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. అభివృద్ధి సంగతి పక్కన పెట్టి.. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా కుప్పలు తెప్పలుగా సంక్షేమ పథకాల్ని ప్రకటించేస్తున్నారు.. కొన్నిటిని అమల్లోకి తీసుకొచ్చేశారు కూడా. ఇంకా అమల్లోకి రావాల్సినవి చాలానే వున్నాయి. కానీ, వాటి కోసం క్యాలెండర్ ఖరారైపోయింది దాదాపుగా.
ఇదిలా వుంటే, ఐదు నెలలు తిరగకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయాయంటూ ఓ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. ప్రధానంగా ‘రెడ్డి’ సామాజిక వర్గం తాలూకు పెత్తనం, వైసీపీలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలకు ఇబ్బందికరంగా మారుతోందట. ‘పైకి సామాజిక న్యాయం.. లోపల మాత్రం సొంత సామాజిక వర్గ న్యాయం.. అన్నట్లుంది పరిస్థితి..’ అంటూ పలువురు సీనియర్ నేతలు, తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ప్రకటించిన అధికార ప్రతినిథుల జాబితా చూసినా, తాజాగా వెల్లడయిన ఇన్‌ఛార్జి మంత్రుల లిస్ట్ చూసినా.. రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. నామినేటెడ్ పోస్టుల్లో అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం కల్పిస్తున్నట్లు పైకి ప్రభుత్వం ఎంతలా చెబుతున్నా, గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు ఇంకోలా కనిపిస్తున్నాయి. కీలకమైన పోస్టులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే దక్కుతున్నాయి.
ఒకవేళ ఇతర సామాజిక వర్గాలకు ఉన్నత పదవులు దక్కినా, వాటిపై పెత్తనం చేసేందుకు ‘షాడో’ నేతలు అనధికారికంగా నియమితులలవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క, గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కీ అర్థమవుతున్నాయి. ఈ క్రమంలోనే ‘ఇన్‌ఛార్జి మంత్రుల మార్పు’ అంశం తెరపైకొచ్చింది.
అదే సమయంలో, ‘పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించొద్దు..’ అంటూ పదే పదే మంత్రుల్నీ, ముఖ్య నేతల్నీ వైఎస్ జగన్ మందలిస్తుండడం గమనార్హం. అంతలా జగన్‌ని చాలామంది నేతలు ఇరిటేట్ చేస్తున్నారనీ, వారిని అదుపు చేయలేని స్థితిలోకి వైఎస్ జగన్ నెట్టివేయబడ్తున్నారనీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
108404 884008woah i like yur web site. It genuinely helped me with the information i wus seeking for. Appcriciate it, will bookmark. 804026
432814 692232Genuinely clear web website , thanks for this post. 194227
510500 782077Id forever want to be update on new posts on this web site , bookmarked ! . 715775
629028 322260really very good post, i undoubtedly love this excellent site, keep on it 544311
99110 58267Hello! This is my first visit to your blog! We are a group of volunteers and starting a new initiative in a community in the same niche. Your blog provided us valuable information to work on. You have done a outstanding job! 452039
863323 298241I like this weblog so much, saved to my bookmarks . 970895
545712 120781educator, Sue. Although Sue had a list of discharge instructions in her hand, she paused and 602792