Switch to English

అబ్జర్వేషన్‌: రివర్స్‌ టెండరింగ్‌తో ‘మిగులు’ నిజమెంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

ఏదన్నా ఓ ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే.. చాలా వ్యవహారాలుంటాయి. కాంట్రాక్టులు, సబ్‌ కాంట్రాక్టులు.. చాలా పెద్ద కథే నడుస్తుంటుంది. అధికార పార్టీకి అనుకూలంగా వుండే సంస్థలకే ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కుతాయన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఓ ప్రభుత్వ హయాంలో ఓ ప్రాజెక్టు ప్రారంభమైతే, ఇంకో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘కాంట్రాక్టర్‌’ని మార్చేసేందుకు ప్రయత్నాలు జరగడం సర్వసాధారణం. దీనికి ‘రివర్స్‌ టెండరింగ్‌’ అనే ముసుగు తొడిగింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం.

ఆ రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను సమర్థించుకోవడం కోసం తనకు నచ్చిన కాంట్రాక్టు సంస్థతో ‘తక్కువ’కు కోట్‌ చేయిస్తున్నారన్నదీ కాదనలేని వాస్తవం. పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ మేఘా సంస్థకే ఎలా దక్కుతున్నాయి.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఏమీ కాదు. ఆ సంస్థకు ప్రాజెక్టులన్నీ కట్టబెట్టాలన్న చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వుండడంతో అన్నీ సహజంగానే అనుకున్నట్లు జరుగుతున్నాయన్నమాట.

సరే, ఇంతకీ రివర్స్‌ టెండరింగ్‌తో ‘మిగులు’ నిజమేనా.? అంటే, నేతి బీరకాయలో నెయ్యి వుండడం ఎంత వాస్తవమో.. ప్రాజెక్టుల కారణంగా ప్రభుత్వాలకు ఖర్చు తగ్గడం కూడా అంతే వాస్తవం. ‘దాదాపు వెయ్యి కోట్లు మిగిల్చేశాం..’ అని చెప్పుకుంటోంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ సర్కార్‌, రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో. ప్రాజెక్ట్‌ పూర్తయితే తప్ప ‘మిగులు’ అన్న మాట గురించి మాట్లాడుకోలేం. కానీ, వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘మిగిల్చేశాం..’ అంటూ డప్పు కొట్టుకుంటోంది.

వర్షాలు, వరదల పేరు చెప్పి పోలవరం ప్రాజెక్టు పనుల్ని నాలుగు నెలలుగా నిలిపేసిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన పనుల్ని తనకు నచ్చిన సంస్థలకు అప్పగిస్తూ.. మిగిల్చేశామని ప్రకటించుకుంటున్న సంగతి తెల్సిందే. ప్రాజెక్టుల ఆలస్యం అత్యంత ఖరీదైన వ్యవహారం. వందల కోట్లతో పూర్తయిపోయే ప్రాజెక్టులు ఆలస్యం కారణంగా, వేల కోట్లతో కూడా పూర్తయ్యే పరిస్థితి వుండదు. పోలవరం ప్రాజెక్టు ఇందుకు స్పష్టమైన నిదర్శనం.

పది పదిహేనేళ్ళ క్రితం అంచనాలకీ, ఇప్పటి అంచనాలకీ తేడా ఓ రేంజ్‌లో వుంది. ఆ లెక్కన, ఈ నాలుగు నెలల ఆలస్యం.. ఖచ్చితంగా ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం చూపతుంది. మరి, మిగలడం.. అనే మాటలో అర్థమేముంది.? జనాన్ని మభ్యపెట్టేందుకే మిగల్చేశాం.. అని చెబితున్నారుగానీ, జనం అంత అమాయకులు కానే కారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...