Switch to English

Baby: బేబీ థర్డ్ సింగిల్ ‘ప్రేమిస్తున్నా’ నాకు ఎంతో బాగా నచ్చింది: రష్మిక మందాన్న

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

Baby: మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ‘ప్రేమిస్తున్నా’ అనే మూడో పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ పాటను నేషనల్ క్రష్ రష్మిక మందాన్న చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్రయూనిట్. అనంతరం..

మారుతి మాట్లాడుతూ.. ‘ఒక్కో పాట, ఒక్కో ప్రమోషన్ జనాల్లోకి రీచ్ అవుతోంది. ఒక్కో పాటకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.. ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోందంటే చాలా గొప్ప విషయం. ఆర్గానిక్ లవ్ స్టోరీస్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి గొప్ప కంటెంట్‌ను సాయి రాజేష్‌ తీశారు. టీం అంతా కూడా ఎంతో కష్టపడుతోంది. ఈ టీం కోసం పాటను రిలీజ్ చేసేందుకు వచ్చిన రష్మిక గారికి థాంక్స్’ అని అన్నారు.

సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు ప్రత్యేక ఈవెంట్. కలర్ ఫోటో సినిమా రిలీజ్ అయిన తరువాత వచ్చిన 25వ ఈవెంట్ ఇది. రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తూ పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఒక్కో పాట, ఒక్కో పోస్టర్‌ను ఎంతో క్రియేటివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. కలెక్షన్ల గురించి మేం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌’ అని అన్నారు.

సాయి రాజేష్‌ మాట్లాడుతూ.. ‘రష్మిక లాంటి స్టార్‌లు ఈ పాటను ప్రమోట్ చేయడం అవసరం. మా కోసం వచ్చిన రష్మికకు థాంక్స్. మంచి పాట.. మంచి సింగర్లను కోరుకుంటుంది. గెలుపు తలుపులే పాట లాంటిది మళ్లీ ఎందుకు పాడలేదని శ్రీరామచంద్ర గురించి అనుకుంటూ ఉండేవాడిని. రోహిత్‌ చాలా టాలెంటెడ్ సింగర్. ఇప్పుడు ఆయనకు సరైన టైం వచ్చింది. లిరిక్ రైటర్ సురేష్‌ ఎంతో చక్కగా పాటను రాశారు. బేబీలో మూడు పాటలు రాశారు. ప్రమోషన్స్ కోసం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్న మా ఎస్‌కేఎన్, మారుతి గారికి థాంక్స్. కచ్చితంగా ఈ పాట బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాను జూలై 14న రిలీజ్ చేయబోతోన్నాం’ అని అన్నారు.

రష్మిక మందాన్న మాట్లాడుతూ.. ‘ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ నాకు బాగా నచ్చింది. ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాటను లూప్ మోడ్‌లో వింటూనే ఉన్నాను. ఆనంద్‌ మ్యూజిక్‌ టేస్ట్‌కు నేను ఫ్యాన్. బేబీ టీంకు ఆల్ ది బెస్ట్. విరాజ్, వైష్ణవికి కంగ్రాట్స్. నన్ను ఈవెంట్‌కు పిలిచినందుకు టీంకు థాంక్స్’ అని అన్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘మా సినిమా జూలైలో రాబోతోంది. ఇంతే ప్రేమను థియేటర్లో కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను. సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా తీసేందుకు పగలు రాత్రి కష్టపడుతున్నాం. ఇది ఒక మ్యూజికల్ ఫిల్మ్. సినిమా రిలీజ్ అయిన తరువాత అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. సందీప్ రాజ్ తీసిన కలర్ ఫోటో నాకు ఎంతో ఇష్టం. ఇంత బిజీగా ఉన్నా మారుతి గారు మాకోసం వచ్చినందుకు థాంక్స్. ఎస్‌కేఎన్ గారు ఇది చిన్న సినిమా అని కాకుండా.. ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ సినిమాలో పని చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా కోసం వచ్చిన రష్మికకు థాంక్స్. ఓ నలభై, యాభై ఏళ్ల తరువాత కూడా ఈ పాటను వింటాం. విరాజ్, వైష్ణవిలకు థాంక్స్. బేబీ సినిమా అందరికీ నచ్చతుంది’ అని అన్నారు.

నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు ఇంత మంచి మ్యూజిక్ రావడానికి కారణం విజయ్ బుల్గానిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు విజయ్ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ మాట విని అప్పుడే ఆయనతో పని చేయాలని ఫిక్స్ అయ్యాను. విజయ్ టాలెంట్‌ వల్లే ఈ సినిమా పాటలు ఇంతగా హిట్ అయ్యాయ’ని అన్నారు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఇందులో నేను కనిపిస్తున్నాను. గతంలో రిలీజ్ చేసిన రెండు పాటలను హిట్ చేశారు. ఈ మూడో పాటను కూడా హిట్ చేస్తారని అనుకుంటున్నాను. నా మొదటి సినిమా రిలీజ్ టైంలోనూ రష్మిక ట్వీట్ వేశారు. మా పాటను రిలీజ్ చేసిన రష్మిక గారికి థాంక్స్. లిరిక్ రైటర్ సురేష్‌ గారు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు, సింగర్ రోహిత్‌ గారు ఈ రోజు మా హీరోలు’ అని అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. టీం అంతా ఎంతో కష్టపడి సినిమాను చేశాం. ఇది మా అందరికీ ఎంతో స్పెషల్. ఎంతో నమ్మకంగా ఈ సినిమాకు పని చేశాం. ఇది కచ్చితంగా మీ అందరి హృదయాలను దోచేస్తుంది. ఈ మూడో పాట కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

లిరిక్ రైటర్ సురేష్ మాట్లాడుతూ.. ‘ఈ పాట నా కెరీర్‌లో మలుపుతిప్పుతుందని ఆశిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్ మూవీ మేకర్స్‌కు, విజయ్ బుల్గానిన్‌లకు థాంక్స్’ అని అన్నారు.

ఎడిటర్ విప్లవ్ నైషధం మాట్లాడుతూ.. ‘ఈ పాటకు పదింతల ఎమోషన్స్ సినిమాలో ఉంటుంది. సినిమా త్వరలోనే రాబోతోంది. ఎదురుచూస్తూ ఉండండి’ అని అన్నారు.

సింగర్ శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. ‘నాకు పాట పాడే అవకాశం ఇచ్చిన సాయి రాజేష్‌ గారికి థాంక్స్. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసి నాకు ఈ సాంగ్ ఇచ్చారు. గెలుపు తలుపులే పాట పాడారు కదా?.. ఆ పాటకు నేను ఫ్యాన్ అని సాయి రాజేష్ గారు అన్నారు. మళ్లీ ఆ స్థాయిలో నాకు పేరు తెచ్చే పాట అవుతుంది. ఆనంద్, విరాజ్, వైష్ణవి, ఎస్‌కేఎన్‌లకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

సింగర్ రోహిత్ మాట్లాడుతూ.. ‘మంచి పాట పాడి నీ పేరు నిలబెడతాను అని మా అమ్మకు మాటిచ్చాను. ఇంత మంచి పాటను పాడే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ పాట ఆడియెన్స్ అందరికీ నచ్చాక మళ్లీ మాట్లాడతాను’ అని అన్నారు.

సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ.. ‘ఫస్ట్ రెండు సాంగ్స్ పెద్ద హిట్ చేశారు. సాయి రాజేష్ గారు మంచి సందర్భాన్ని క్రియేట్ చేయడం వల్లే ఇంత మంచి పాటలు వచ్చాయి. మా అందరినీ ఎస్‌కేఎన్ గారు నమ్మారు. సురేష్‌ గారు మంచి లిరిక్స్ రాశారు. అందరూ పాటను చక్కగా పాడారు. మారుతి గారికి థాంక్స్’ అని అన్నారు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...