Ram Charan: శంకర్ (Shankar) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న గేమ్ చేంజర్ (Game Changer) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. టీమ్ నుంచి అప్డేట్స్, రిలీజ్ పై క్లారిటీ రాకపోవడం, రామ్ చరణ్ ప్రస్తుతం ఇదే సినిమాపై పని చేస్తూండటం, షూటింగ్ నెమ్మదిగా జరగడం.. మరోవైపు లీక్స్ తో మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కాస్త నిరాశ, ఎదురుచూపులతో ఉన్నారు. అటువంటి వీరికి శంకర్ అదిరిపోయే అప్డేట్ ఇవ్వడంతో పైవన్నీ మర్చిపోయి సంబరాల్లో తేలిపోతున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్న గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ ‘జరగండి..’ దీపావళికి అంటూ నిర్మాణ సంస్థ పెట్టిన రామ్ చరణ్ పిక్ నెట్టింట బీభత్సం చేస్తోంది. పర్పుల్ కలర్ డ్రెస్సింగ్ వెనుక నుంచి రామ్ చరణ్, ముందు అదిరిపోయే కలరింగ్ తో ఇళ్లు ఉన్న పిక్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఎంత ఆలస్యం చేస్తే అంత కిక్ ఇస్తావన్న మాట.. అంటూ శంకర్ ను అభిమానులు పొగుడుతూ సంబరాల్లో తేలిపోతున్నారు.
Team #GameChanger wishes you all a Happy Dussehra.
And there’s more to celebrate 😉
Get ready for the electrifying first single #Jaragandi coming your way this Diwali 🔥A @MusicThaman musical@AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @DOP_Tirru @artkolla @SVC_official… pic.twitter.com/IHymY8XUJR
— Sri Venkateswara Creations (@SVC_official) October 23, 2023