Switch to English

రఘురామకృష్ణరాజు ‘న్యాయ’ పోరాటం: వైసీపీ ‘కాస్ట్‌లీ మిస్టేక్‌’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. సొంత పార్టీ తనను దూరంగా పెడుతున్న వేళ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారాయన. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’ అనే పేరుతో రిజిస్టర్‌ అయినా, ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ అనే పేరు ప్రచారంలో వుంది. దీన్ని ‘వైఎస్సార్సీపీ’ అని కూడా అంటున్నాం.

అయితే, పార్టీ తరఫున ఓ ఎంపీకి షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్‌ అయిన పేరునే వాడాల్సి వుంటుందన్న కనీస విజ్ఞతను వైసీపీ విస్మరించడం ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి బాగా కలిసొచ్చినట్లే కన్పిస్తోంది. తనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరుతో షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చారనీ, తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీగా గెలిచాననీ, ఈ నేపథ్యంలో పార్టీ తరఫున తనపై తదుపరి చర్యలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని రఘురామకృష్ణరాజు ఆశ్రయించారు.

వైసీపీ ఎంపీలు ఈ రోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళి లోక్‌సభ స్పీకర్‌కి రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు చేయాలనుకుంటున్న తరుణంలో, ఆయన ‘న్యాయ పోరాటానికి’ దిగడం వైసీపీ శ్రేణుల్ని షాక్‌కి గురిచేసిందన్నది నిర్వివాదాంశం. ‘మా పార్టీ ఎంపీలు పనిగట్టుకుని ఢిల్లీకి వెళ్ళి స్పీకర్‌కి నా మీద ఫిర్యాదు చేసినా, ఆ తర్వాత నా వాదన కూడా విన్పించే అవకాశం వుంటుంది. వాళ్ళనుకుంటున్నట్లు ఏమీ జరగదు..’ అని ఇప్పటికే రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేసిన విషయం విదితమే. ఇప్పుడీ ‘న్యాయ పోరాటం’ ద్వారా ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’కి దిమ్మ తిరిగే షాక్‌ తగలబోతోందన్నది రాజకీయ పరిశీలకుల వాదనగా కన్పిస్తోంది.

కాగా, ‘అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌’ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర మరో పార్టీ ఆంధ్రప్రదేశ్‌ నుంచే రిజిస్టర్‌ అయ్యింది. ఆ పార్టీ అధినేత కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గానే వున్నారు. ‘విజయసాయిరెడ్డి అత్యుత్సాహం పార్టీ గుర్తింపు రద్దయ్యేదాకా వెళ్ళేలా వుంది..’ అని ఓ సందర్భంలో రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. అదే నిజమవుతుందా.? రఘురామకృష్ణరాజు ఎపిసోడ్‌లో వైసీపీ చాలా ‘కాస్ట్‌లీ మిస్టేక్‌’ చేసేస్తోందా.? వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...