Switch to English

జగన్‌కి గుడి కట్టడమేంటి.? హిందువుడిగా ఖండిస్తున్నానన్న రఘురామ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

‘వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఓ ఎమ్మెల్యే గుడి కట్టడమేంటి.? వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీద సదరు ఎమ్మెల్యేకి మరీ అంత భక్తి ఎక్కువైపోతే, ఎంచక్కా చర్చిని నిర్మించుకోవచ్చు..’ అంటూ పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి స్థానిక వైసీపీ నేతలు కట్టనున్న గుడికి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. ‘జీవించి వున్న వ్యక్తికి గుడి కట్టడమేంటి.?’ అని అంతా ముక్కున వేలేసుకుంటోంటే, అధినేత మెప్పు కోసం మరికొందరు వైసీపీ నేతలు ఇదే బాట పట్టనున్నారంటూ సోషల్‌ మీడియా వేదికగా కుప్పలు తెప్పలుగా గాసిప్స్‌ ప్రచారంలోకి వచ్చాయి.

ఇక, ఈ విషయమై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గుడి, దేవాలయం అన్న మాటలు హిందూ మతానికి సంబంధించినవి. వైఎస్‌ జగన్‌ మీద నాకూ అభిమానం, ప్రేమ, గౌరవం వున్నాయి. కానీ, హిందువుడిగా నేను ఈ చర్యల్ని వ్యతిరేకిస్తున్నాను. కావాలంటే చర్చి కట్టుకోండి..’ అంటూ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలిప్పుడు పెను సంచలనంగా మారాయి.

‘ఓ ప్రజా ప్రతినిది¸ ఇలాంటి చర్యలకు ఒడిగట్టడం అస్సలేమాత్రం సబబు కాదు. ఆయనకు ప్రేమ వుంటే, ఇంట్లో వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టుకుని పూజలు చేసుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు. అంతే తప్ప, హిందూ మతాన్ని కించపర్చేలా వ్యవహరించడం సమర్థనీయం కాదు..’ అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

‘ఇలాంటోళ్ళను ప్రోత్సహించడమంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంటనే ఈ విషయంపై స్పందించాలి. ప్రజల గుండెల్లో గుడి కట్టుకోవాలి తప్ప. ఇలా పార్టీ నేతలతో గుడులు కట్టించుకుంటే, అది మీ స్థాయికి తగదు..’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని ఉద్దేశించి రఘురామకృష్ణ మండిపడ్డారు.

ఇదిలా వుంటే, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్‌తో ఆందోళనలు చేపడుతోన్న అమరావతి ప్రాంత మహిళా రైతులు ఇటీవల రోడ్డుపై మోకాళ్ళపై నిలబడి న్యాయస్థానాల్ని వేడుకొంటున్న వైనంపై సోషల్‌ మీడియాలో వైసీపీ మద్దతుదారులు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని రఘురామకృష్ణరాజు తీవ్రంగా తప్పు పట్టారు. ‘ఆడపడుచుల్ని కుక్కలతో పోల్చుతారా.? వేట కుక్కలై మన ప్రభుత్వాన్ని తరిమికొట్టే శక్తి ఆ మహిళలకు వుంది..’ అంటూ హెచ్చరించారు రఘురామకృష్ణరాజు.

అమరావతి కోసం ఉద్యమిస్తూ ప్రాణాలు కోల్పోయనివారిని త్వరలో పరామర్శిస్తాననీ, గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినవారిని ఓదార్చేందుకు వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేసిన దరిమిలా, ఆ స్ఫూర్తితో తాను అతి త్వరలో అమరావతి ప్రాంతానికి వెళతానని చెప్పారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...