Switch to English

సాయి తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ మూవీ రివ్యూ  

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2.5/5  

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ తదితరులు..
నిర్మాత: బన్నీ వాస్
దర్శకత్వం: మారుతి
సినిమాటోగ్రఫీ: జైకుమార్ సంపత్
మ్యూజిక్: థమన్ ఎస్
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019

‘చిత్రలహరి’ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆ ఫామ్ ని కంటిన్యూ చేయడం కోసం కంప్లీట్ ఎంటర్ టైనర్స్ తీసే డైరెక్టర్ మారుతి తో కలిసి చేసిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. మూడు తరాల మధ్య ఎమోషన్స్ ని చూపిస్తూ, తాత – మనవడు బంధం హైలైట్ చేస్తూ చేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా సాయి తేజ్ కి మరో హిట్ ని ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం

కథ:  

రాజమండ్రిలో సెటిల్ అయిన సత్యరాజ్ కి నలుగురు సంతానం. అందులో ముగ్గురు యుఎస్ లో సెటిల్ అయితే మరొక్కరు ఇండియాలో సెటిల్ అవుతారు. ఎవరి లైఫ్స్ లో వాళ్ళు బిజీగా ఉండగా సత్యరాజ్ కి లంగ్ కాన్సర్ అని, మరో 5 వారాలకంటే మించి బ్రతికే ఛాన్స్ లేదని డాక్టర్స్ చెబుతారు. అప్పుడే సత్యరాజ్ మనవడు సాయి ధరమ్ తేజ్(సాయి తేజ్) అబ్రాడ్ నుంచి వచ్చి, తాతయ్య తీరని కోరికలు అన్నీ తీర్చేయాలనుకుంటాడు. సత్యరాజ్ కి తేజ్ పెళ్లి చూడడం చివరి కోరిక అంటారు.. దాంతో తేజ్ కి ఏంజల్ ఆర్నా(రాశీ ఖన్నా)తో లవ్ స్టోరీ, ఫైనల్ గా పెళ్లి ఫిక్స్ అవుతుంది. కానీ ఈ పెళ్లి సాయి తేజ్ ఫాదర్ అయిన రావు రమేష్ కి ఇష్టం ఉండదు. అయినా తప్పక ఒప్పుకుంటాడు. అలా అందరూ సత్యరాజ్ చనిపోయే లోపు పెళ్లి చేయాలని రాజమండ్రికి చేరుతారు. అక్కడి నుంచి ఆ పెళ్లి ఎలా జరిగింది? ఆ పెళ్ళికి వచ్చిన అడ్డంకులేంటి? సత్యరాజ్ కి సాయి తేజ్ పెళ్లి చూడాలనే కోరిక తీరిందా? లేదా? రావు రమేష్ కి పెళ్లి కాన్సల్ చేసే ఛాన్స్ ఏమన్నా దొరికిందా? అనేదే కథ..

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

కథలేకపోయినా డైరెక్టర్ రాసుకున్న పాత్రల్లో ప్రతి ఆర్టిస్ట్ అద్భుతమైన నటనని కనబరచడమే ఈ సినిమాకి బిగ్గెట్స్ ప్లస్ అని చెప్పాలి. రాసుకున్న కథ పరంగా ఎక్కడో సాయి తేజ్ కి స్క్రీన్ టైం తక్కువ అనిపించినా తనకున్న టైంలోనే తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక టిక్ టాక్ స్టార్ ఏంజల్ ఆర్నాగా రాశీ ఖన్నా నవ్వించడమే కాకుండా సినిమాలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ముఖ్యంగా లంగావోణీ, పరికినీల్లో కుర్రకారుని తనవైపుకు ఆకర్షించుకుంటుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

అలాగే సత్యరాజ్ చాలా ఎనర్జిటిక్ గా ఉండడమే కాకుండా ఎమోషనల్ గా కూడా హార్ట్ టచ్ చేస్తుంది. రావు రమేష్ అయితే తన పాత్రని రఫ్ఫాడించాడు అని చెప్పాలి. ముఖ్యంగా తన వన్ లైనర్స్ చాలా బాగా పేలాయి. అలాగే మిగతా నటీనటులు మురళీ శర్మ, విజయ్ కుమార్, రజిత, అజయ్, సత్యం రాజేష్ తదితరులు బాగా చేసారు. ఇక సుహాస్, భద్రం, మహేష్ ల కామెడీ అక్కడక్కడా పేలింది.

సినిమాలో ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేసే విషయాల గురించి చెప్పుకుంటే, సాయి తేజ్ – రాశీ ఖన్నాల లవ్ ట్రాక్ మరియు వారి మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా నవ్విస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే ప్రతి మాంటేజ్ సాంగ్ సూపర్బ్ గా తీశారు. సెకండాఫ్ లో ఫామిలీ డిన్నర్ సీన్ బాగా అంటే బాగా నవ్విస్తుంది. ఎమోషనల్ పరంగా చూసుకుంటే మురళీ శర్మ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ సీన్స్ ఎమోషనల్ గా అందరినీ టచ్ చేస్తాయి.

ఆఫ్ స్క్రీన్:  

‘ప్రతిరోజూ పండగ’ సినిమాకి ది బెస్ట్ హైలైట్ అంటే డైరెక్టర్ మారుతూ సెలక్ట్ చేసుకున్న మెయిన్ ప్లాట్ పాయింట్. చివరి సీన్ లో చెప్పే ఈ లైన్ సింప్లీ సూపర్బ్.. జైకుమార్ సంపత్ విజువల్స్ చాలా బాగున్నాయి. అందరికీ చాలా మెమొరీస్ ని గుర్తు చేయడానికి ఈయన ఫ్రెమింగ్ చాలా హెల్ప్ అయ్యింది. థమన్ అందించిన పాటలు బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ఎమోషనల్ డైలాగ్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

సినిమా చాలా సింపుల్ గా స్లోగా స్టార్ట్ అవుతుంది, ఆ స్లో అనేది చివరి వరకూ కంటిన్యుడూ అయ్యింది. ఎక్కడా స్పీడ్ అవ్వడం కానీ, ఆడియన్స్ ఈ మలుపు అదిరిపోయింది అనేలా ఫీల్ అయ్యే సీన్స్ అంతగా లేవు. ఫస్ట్ హాఫ్ ఏ చాలా బోరింగ్ గా ఉంది, ఇంటర్వల్ ఎపిసోడ్ అయితే మరీ వీక్ అనుకున్న ప్రేక్షకులకి సెకండాఫ్ మొదటి 30 నిమిషాలు కూడా ఇంకా బోర్ కొట్టించారు. అలాగే విలన్ ట్రాక్ బాలేదు. ఏదో సుప్రీమ్ హీరో కాబట్టి ఫైట్స్ ఉండాలి కాబట్టి ఓ ఆసక్తి లేని ట్రాక్ పెట్టి హీరో కోసం ఫైట్స్ ని బలవంతంగా కథలోకి జొప్పించారు. ఇక ఈ ఫామిలీ ఎంటర్ టైనర్ కి అతి ముఖ్యమైనది ఎమోషనల్ కనెక్షన్.. అదే ప్రేక్షకులకి మిస్సింగ్. నటీనటుల నటన బాగున్నా పాత్రల డిజైనింగ్ సరిగా లేదు అందుకే ఎమోషనల్ గా పెద్దగా కనెక్ట్ అవ్వరు. ఓవరాల్ గా సినిమా పాయింట్ బాగుందని కనెక్ట్ అవుతారే తప్ప, సినిమాలోని పాత్రల ద్వారా ఆ ఎమోషనల్ పాయింట్ కి కనెక్ట్ కారు అనేది ట్విస్ట్. అలాగే మారుతి రాసుకున్న చాలా కామెడీ బ్లాక్స్ పేలకపోగా, మరీ ఇంత పేలవమైన కామెడీ రాసింది మారుతీ యేనా అనేంత డౌట్ ని కూడా క్రియేట్ చేసాడు.

ఆఫ్ స్క్రీన్:  

ముందుగా కెప్టెన్ అఫ్ ది షిప్ అయినా మారుతితో మొదలు పెడితే.. ‘ప్రతిరోజూ పండగే’ అనే టైటిల్ కోసం అతను తీసుకున్న లైన్ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. కానీ దానిని పూర్తి కథగా మలచడంలో బిగ్ ఫెయిల్ అని చెప్పాలి. ఎందుకంటే రెండున్నర గంటల సినిమా ద్వారా కనెక్ట్ చేయాల్సిన ఎమోషన్ ని కనెక్ట్ చేయలేదు. ఇక స్క్రీన్ ప్లే అన్నా ఆసక్తిగా రాసుకున్నారా అంటే అదీ లేదు. చిన్న స్టోరీ లైన్ కి సాగదీత మరియు పరమ బోరింగ్ నేరేషన్ తోడవడంతో ప్రేక్షకులు చాలా సార్లు థియేటర్ నుంచి బయటకి వెళ్లి వచ్చారు. కథ – స్క్రీన్ ప్లే వీక్ అవ్వడంతో డైరెక్టర్ గా కూడా బెటర్ అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయాడు. అనగా డైరెక్షన్ మెలకువలతో సినిమాని నిలబెట్టలేకపోయాడు. అక్కడక్కడా పేలే కామెడీ డైలాగ్స్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ బాగున్నాయి. ఓవరాల్ గా డైరెక్టర్ మారుతి సినిమానా ఇది, అంత బాడ్ గా ఎలా తీసాడా అని అందరూ పెదవివిరిచే సినిమాని తీశారు. ఓవరాల్ గా మారుతి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్బ్ లైన్, వరస్ట్ ఎగ్జిక్యూషన్.. దీనికి ‘ప్రతిరోజూ పండగే’ అనే టైటిల్ కంటే మనవడు దిద్దిన కాపురం అని పెట్టచ్చు.

ఇక కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అయితే అస్సలు బాలేదు.. సినిమా చాలా అంటే చాలా సాగదీతగా ఉంది. ఆయన సీనియారిటీ పరంగా అయినా చాలా వర్కౌట్ అవ్వవు అనిపించినా సీన్స్ తీసెయ్యాల్సింది. ఇక థమన్ మ్యూజిక్ జస్ట్ ఓకే. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏమీ సినిమాని నిలబెట్టే స్థాయిలో లేదు. రవీందర్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది.

విశ్లేషణ: 

‘ప్రతిరోజూ పండగే’ అనే సూపర్ క్లాస్ టైటిల్ తో సాయి ధరమ్ తేజ్ – మారుతిలు కలిసి ఫుల్ గా నవ్వించి చివర్లో అందరినీ మనసుకు హత్తుకునే ఎమోషన్ తో టచ్ చేసి ఎన్నో రోజులు మనతో ట్రావెల్ అయ్యే హార్ట్ టచింగ్ ఫిల్మ్ లా ఉంటుందని ఆశించి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు చాలా వరకూ నిరాశ పడతారు. ఎందుకంటే మిమ్మల్ని బాగా నవ్వించేంత కామెడీ లేదు, అలాగే మిమ్మల్ని ఎమోషనల్ గా పిండేసేంత ఎమోషన్ కూడా లేదు. అక్కడక్కడా వచ్చే కామెడీ, పాటల్లో మనకు చిన్ననాటి కొన్ని మెమోరీస్ ని గుర్తు చేసే కొన్ని పాటలు, రాశీ ఖన్నా బ్యూటీ మరియు క్లైమాక్స్ ఎమోషనల్ డైలాగ్స్ మరియు అద్నరూ ఫాలో అయితే బాగుండు అనిపించే స్టోరీ లైన్ తప్ప సినిమాలో ఆధ్యంతం మిమ్మల్ని కట్టి పడేసేంత కథ కానీ, కథనం కానీ ఇందులో లేవు. నవ్వించేలేని కామెడీ మరియు ఎమోషన్ ని షూట్ చేసిన విధానం చూస్తే  డైరెక్టర్ మారుతి బ్రాండ్ ని ఇంకాస్త తక్కువ చేసేసే సినిమా మరియు అలాగే చిత్రలహరి తర్వాత బెటర్ హిట్ వస్తుందనుకున్న సాయి తేజ్ కి మరో గుదిబండలాంటి సినిమా ‘ప్రతిరోజూ పండగే’.

ఫైనల్ పంచ్: ప్రతిరోజూ పండగే – ఈ పండగ ప్రేక్షకులకి మాత్రం బోరింగ్.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2.5/5  

 

 

<——— ప్రతిరోజూ పండగే మూవీ యుఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ ———>

ప్రతిరోజూ పండగే మూవీ యుఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ డిసెంబర్ 20, 02.00A.M IST. తప్పక తెలుగు బులెటిన్ పేజీ ని ఫాలో అవ్వండి..

04:50AM: ఫైనల్ రిపోర్ట్: సెకండాఫ్ కూడా చాలా స్లోగా, కథలో బెటర్ మెంట్ లేకుండా సాగింది. ఒకటి రెండు పాటలు మరియు రెండు కామెడీ సీన్స్ బాగున్నాయి. అలాగే ఈ మూవీకి కీలకమైన ఎమోషనల్ సీన్స్ జస్ట్ ఓకే అనిపించుకున్నాయి. ఓవరాల్ గా మిమ్మల్ని రెండున్నర గంటల పాటు పెద్దగా ఎంటర్టైన్ చేయలేని సినిమా. ఒక్క క్లైమాక్స్ ఎమోషనల్ డైలాగ్స్ వలన చివర్లో కాస్త బెటర్ అనిపిస్తుంది కానీ ఇది ఎంత వరకూ సినిమాకి హెల్ప్ అవుతుందనేది చూడాలి.. అందులోనూ ఇది మారుతి సినిమానా అని షాక్ ఇచ్చే సినిమా ‘ప్రతిరోజూ పండగే’.. రివ్యూ త్వరలోనే..

04:42AM: ప్రతి ఫ్యామిలీ సినిమాలోలానే హీరో అయినా సాయి తేజ్ ఫామిలీ మెంబర్స్ అందరికీ క్లాస్ పీకడం, అది విని వెంటనే వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి మారిపోవడం.. అందరూ కలిసిపోవడం.. తాతయ్య కోరిక అయినా పెళ్లి జరిగిపోవడం.. సినిమాకి శుభం కార్డు పడడం అలా అలా జరిగిపోయాయి. కానీ ఇక్కడ హైలైట్ గా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ సీన్ డైలాగ్స్ సూపర్బ్ గా ఉన్నాయి. సినిమా మొత్తానికి ఈ సీన్ డైలాగ్స్ మేజర్ హైలైట్..

04:35AM: తాతయ్యని ఆ సందర్భంలో వదిలి వెళ్ళిపోయినా ఫామిలీ మెంబర్స్ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇస్తాడు తేజ్.. దాంతో అందరూ మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తారు.. క్లైమాక్స్ మొదలైంది..

04:35AM: ఫామిలీలో మనస్పర్థలు.. సత్యరాజ్ ని అందరూ వదిలివెళ్ళిపోతారు.. సాయి తేజ్ – రాశీ ఖన్నాలు మాత్రం సత్యరాజ్ తో ఉండిపోవడంతో మూవీ క్లైమాక్స్ కి ఎంటర్ అయ్యింది.

04:28AM: ప్రస్తుతం కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ జరుగుతున్నాయి. ఈ సీన్స్ ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.

04:24AM: చిన్న మిస్ అండర్ స్టాండింగ్ లో జరిగే మురళి శర్మ సీన్ లో కామెడీ కొంత నవ్విస్తుంది.

04:20AM: ఫ్యామిలీ పూజ సమయంలో రిలీజ్ కి ముందు హైప్ ఇచ్చిన సాయి తేజ్ సిక్స్ ప్యాక్ బాడీ ఫైట్.. విలన్స్ అయినా అజయ్ – సత్యం రాజేష్ లతో జరిగే ఈ ఫైట్ ని బాగా కంపోజ్ చేశారు..

04:15AM: సత్యరాజ్ బర్త్ డే సందర్భంగా ‘తకిట తధిమి’ సాంగ్ టైం.. ఈ సాంగ్ లో అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు. పిక్చరైజేషన్ కూడా అదిరింది. ఫామిలీ ఫంక్షన్స్ కి ఇదొక ఫీస్ట్ లాంటి సాంగ్ అని చెప్పాలి.

04:05AM: ఇంటిల్లిపాదీ కూర్చొని డిన్నర్ చేసే కామెడీ సీన్ చాలా బాగుంది. ప్రేక్షకులందరినీ ఈ సీన్ బాగా నవ్విస్తుంది.

04:00AM: సెకండాఫ్ రాను రాను వెరీ బోరింగ్ కామెడీ సీన్స్ తో, అసలు కథే లేదు అనిపించేలా సాగదీత సీన్స్ తో ముందుకు వెళ్తోంది.. మరీ ఇంత స్లోగా ఉండడంతో ఇది మారుతి సినిమానేనా అనే డౌట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అనుకున్న ఫన్ వర్కౌట్ అవ్వడం లేదు..

03:55AM: సత్యరాజ్ మళ్ళీ బతకడంతో పిల్లలు అంతా ఎక్కువ రోజులు ఇండియాలో ఉండలేం అంటే, సాయి తేజ్ ఆస్థి గురించి చెప్పి పెట్టే మెలికతో అందరూ ఇక సత్యరాజ్ అంత్యక్రియల వరకూ ఉండాల్సిందే అని ఫిక్స్ అవుతారు..

03:50AM: సాయి తేజ్ – రాశీ ఖన్నాల మధ్య డ్యూయెట్ సాంగ్.. తేజ్ స్టెప్స్ బాగున్నాయి..

03:44AM: సాయి తేజ్ ఎందుకు రాశీ ఖన్నాని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అనే రివీల్ మీద సెకండాఫ్ మొదలైంది..

03:38AM: ప్రతిరోజూ పండగే ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: సినిమా చాలా సింపుల్ ప్లాట్ లైన్ తో స్లోగా ఫస్ట్ హాఫ్ సాగింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన మాంటేజ్ సాంగ్స్, సాయి తేజ్ – రాశీ ఖన్నా లవ్ ట్రాక్ మరియు కామెడీ సీన్స్ తప్ప, నటీనటుల గుడ్ పెర్ఫార్మన్స్ బాగున్నాయే తప్ప కథా పరంగా ఆడియన్స్ బాగా కనెక్ట్ చేసే పాయింట్ ఏం లేదు. చాలా వరకూ సీన్స్ చుసిన ఫీలింగ్ కూడా వస్తుంది. బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ కావడంతో ఇక సినిమా సెకండాఫ్ పైనే ప్రేక్షకుల ఆశలన్నీ అని చెప్పికోవాలి..

03:34AM: అంతా హ్యాపీగా వెళ్తుంది అనుకున్న టైంలో సాయి తేజ్ పెళ్లి కాకముందే సత్యరాజ్ కి సీరియస్. హాస్పిటల్ కి షిఫ్ట్ అయ్యింది.. ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ మీద ఇంటర్వల్ బ్లాక్..

03:31AM: రావు రమేష్ కి ఈ పెళ్లి ఇష్టం లేదు, కానీ తప్పక వచ్చాడు. ఎప్పటిలానే రావు రమేష్ తనకి ఇచ్చిన పాత్రలో రాఫ్ఫాడిస్తున్నాడు.. చాలా వన్ లైన్ పంచ్ లు బాగా పేలుతున్నాయి..

03:28AM: పెళ్లి పనుల బ్యాక్ డ్రాప్ లో ‘మెరిసాడే మెరిసాడే’ మాంటేజ్ సాంగ్ మొదలైంది.. ఇప్పటి వరకూ పరిచయం చేసిన అన్ని పాత్రలు ఒక ప్లేస్ కి చేరుకుంటున్నాయి. అలాగే పాటని బాగా షూట్ చేశారు..

03:24AM: ఇప్పటి వరకూ సినిమా అలా అలా వెళ్తోంది.. కొన్ని కొన్ని మోమెంట్స్ మరియు అక్కడక్కడా కొన్ని కొన్ని కామెడీ సీన్స్ తప్ప హై ఎంగేజింగ్ పాయింట్ ఏం రాలేదు..

03:20AM: ఫైనల్ గా సాయి తేజ్ – రాశీ ఖన్నాల పెళ్ళి సెట్ అయ్యింది.. అన్ని ఫామిలీస్ కి ఇన్విటేషన్ వెళ్ళింది..

03:18AM: సాయి తేజ్ – రాశీ ఖన్నా ల లవ్ ట్రాక్ మరియు వారి మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి..

03:15AM: సాయి తేజ్ – రాశీ ఖన్నా తాతయ్యల మధ్య సమస్యని సాల్వ్ చేయడంతో.. వారిద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ జరుగుతున్నాయి..

03:10AM: సత్యరాజ్ పొలం ఇష్యూస్ లో విలన్స్ ఎంట్రీ.. సాయి తేజ్ కి వారి మధ్య మొదటి ఫైట్. చిరు ‘ఖైదీ’ సినిమాలోని సైకిల్ సీన్ రెఫరెన్స్ తో చాలా బాగా షూట్ చేశారు..

03:06AM: తాత కోసం సాయి తేజ్ ఏంజల్ ఆర్నాని అండ్ తన బాబాయ్ లని పెళ్ళికి ఒప్పించే పనిలో పడతాడు.. ఏంజల్ ఆర్నాని ఏడిపించేలా సిస్టర్స్ అంతా కలిసి టీజ్ చేయడంలో సెకండ్ సాంగ్.. చాలా బాగా మాంటేజ్ సాంగ్ తీశారు. రాశీ ఖన్నా చాలా బ్యూటిఫుల్ గా ఉంది..

03:02AM: ప్రతిరోజూ పండగే రిలీజ్ పోస్టర్స్ – https://www.telugubulletin.com/sai-tejs-pratiroju-pandaage-release-posters-43910/pratiroju-pandaage4

03:00AM: సాయి తేజ్ – రాశీ ఖన్నా – సుహాస్ మరియు ప్రవీణ్ ల మధ్య కామెడీ సీన్స్ కాస్త నవ్విస్తాయి.

02:55M: సత్యరాజ్ చివరి కోరిక సాయి తేజ్ పెళ్లి చూడాలనుకోవడం.. అదే టైంలో సాయి తేజ్ ఆర్న అలియాస్ రాశీ ఖన్నా తో పరిచయం, ప్రేమ.. తనేమో టిక్ టాక్ సెలబ్రిటీ ఏంజల్ ఆర్న.. తన ఇంట్రడక్షన్ సీన్స్ బాగున్నాయి..

02:50AM: సాయి తేజ్ తన తాతయ్య లాస్ట్ డేస్ లో తన చిన్నప్పటి నుంచీ తీరకుండా ఉండిపోయిన అన్ని కోరికల్ని తీర్చేయాలని ప్రణాళిక వేస్తాడు. నాడులో మొదటగా సత్య రాజ్ చిన్నప్పటి గర్ల్ ఫ్రెండ్ పెద్దాపురం సీన్ నవ్విస్తుంది.

02:46AM: మొదటి 20 నిమిషాలు బాగానే వెళ్తోంది అండ్ ఇప్పటి వరకూ అన్ని పాత్రలను పరిచయం చేసి ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు..

02:42AM: సాయి తేజ్ కి తాతయ్య అంటే అమితమైన ప్రేమ.. వీరిద్దరి మధ్య చైల్డ్ హుడ్ మాంటేజ్ సాంగ్ జరిగింది.. బ్యూటిఫుల్ మోమెంట్స్ తో చాలా బాగా షూట్ చేశారు. చూసిన ప్రతి ఒక్కరికీ మనసుకు హత్తుకొని వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసే సాంగ్..

02:38AM: సత్యరాజ్ కి ముగ్గురు కొడుకులు మరియు ఒక కుమార్తె.. అందులో 3 ఫ్యామిలీస్ అబ్రాడ్ లో సెటిల్ అయ్యాయి. ఒకరేమో ఇండియాలో.. సత్యరాజ్ కి కేవలం 5 వారలు మాత్రమే బ్రతికే ఛాన్స్ ఉందని చెప్పడంతో అందరూ ఇండియాకి బయలుదేరారు..

02:38AM: సత్య రాజ్ కి లంగ్ కాన్సర్.. ఇంకా కొద్దీ రోజులు మాత్రమే లైఫ్ ఉంటుంది.. అబ్రాడ్ లో ఉంటున్న అందరి వారసులకి న్యూస్ వెళ్ళిపోయింది. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ నడుస్తున్నాయి..

02:32AM: హీరోతో పాటు కథ రాజమండ్రికి చేరింది.. అలాగే రావు రమేష్ ఫాదర్ గా, సాయి తేజ్ తాతయ్యగా సత్యరాజ్ ఎంట్రీ ఇచ్చారు.

02:28AM: సాయి తేజ్ తన ఫాదర్ రావు రమేష్ గురించి సీనియర్ నరేష్ కి చెప్తూ ఆయన తన విషయంలో ఎంత పొసెసివ్ అని చెప్పే సీన్స్ బాగున్నాయి.

02:24AM:  సాయి ధరమ్ తేజ్ సింపుల్ అండ్ క్లాసీ లుక్ లో ఎయిర్ పోర్ట్ లో ఎంట్రీ ఇచ్చాడు.. 

02:20AM: ఇటీవలే అందరినీ కలచివేసిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసుని హైలైట్ చేస్తూ.. అందరూ మహిళలకి రక్షణ కల్పించాలనే స్పెషల్ నోట్ తో సాయి తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ సినిమా మొదలైంది.. స్టైలిష్ గా సినిమా టైటిల్స్ పడుతున్నాయి.

02:15AM: చిత్రలహరి’ లాంటి హిట్ తర్వాత సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ – ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడు మారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ కి భారీ క్రేజ్ నెలకొంది.

 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...
తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2.5/5   నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ తదితరులు.. నిర్మాత: బన్నీ వాస్ దర్శకత్వం: మారుతి సినిమాటోగ్రఫీ: జైకుమార్ సంపత్ మ్యూజిక్: థమన్ ఎస్ ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019 'చిత్రలహరి' సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆ ఫామ్ ని కంటిన్యూ చేయడం కోసం కంప్లీట్ ఎంటర్ టైనర్స్ తీసే డైరెక్టర్ మారుతి తో కలిసి చేసిన...సాయి తేజ్ 'ప్రతిరోజూ పండగే' మూవీ రివ్యూ