Switch to English

నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్..
నిర్మాత: సి కళ్యాణ్
దర్శకత్వం: కెఎస్ రవికుమార్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
మ్యూజిక్: చిరంతన్ భట్
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథతో నందమూరి బాలకృష్ణ చేసిన బయోపిక్ నిరాశ పరిచింది. ఆ సినిమా తర్వాత బాలయ్య మళ్ళీ తన అభిమానులు కోరుకునే మాస్ అవతార్ లో చేసిన సినిమా ‘రూలర్’. ఇప్పటికే ‘జై సింహా’ రూపంలో హిట్ ఇచ్చిన కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సెటిలర్స్ సమస్య నేపథ్యంలో రూపొందింది. బాలయ్య ఈ సినిమా నాకోసం చాలా స్లిమ్ అయ్యి స్టైలిష్ సాఫ్ట్ వేర్ లుక్ తో పాటు మాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఈ సినిమా బాలయ్యతో పాటు అభిమానులు కూడా కోరుకునే హిట్ ఇచ్చిందేమో ఇప్పుడు చూద్దాం..

కథ:

జయసుధ వారసుడు, ఓ టాప్ సాఫ్ట్ వేర్ కంపెనీకి సిఈఓ అర్జున్ ప్రసాద్(బాలకృష్ణ). ఓ ప్రాజెక్ట్ కోసం బ్యాంకాక్ వెళ్లిన అర్జున్ ప్రసాద్ ని పోటీ కంపెనీ నుంచి వచ్చిన సోనాల్ చౌహాన్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అర్జున్ ప్రసాద్ తో ప్రేమలో పడి, పెళ్ళికి సిద్ధమవుతుంది. అదే టైంలో ఓ ప్రాజెక్ట్ విషయంలో అర్జున్ ప్రసాద్ కి భవాని నాథ్ తో గొడవ అవుతుంది. ఒకరోజు అర్జున్ ప్రసాద్ మీద అటాక్ చేయగా అక్కడ అందరూ అతన్ని ధర్మ అని పిలవడం మొదలు పెడతారు. దాంతో అర్జున్ ప్రసాద్ కి కన్ఫ్యూజన్.. అసలు ధర్మ ఎవరు? అతని కథ ఏంటి? ధర్మ – అర్జున్ ప్రసాద్ గా మారాడా? లేక ధర్మ కి అర్జున్ ప్రసాద్ కి ఉన్న సంబంధం ఏమిటి? అలాగే ధర్మ కి – భవాని నాథ్ కి ఏమన్నా సంబంధం ఉందా? అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఇలాంటి మాస్ మసాలా కథకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే నందమూరి బాలకృష్ణ అనే చెప్పాలి. వయసుతో సంబంధం లేకుండా అయన ఎనర్జీ లెవల్స్ టాప్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకోసం ఆయన వెయిట్ తగ్గి చేసిన సాఫ్ట్ వేర్ లుక్ పాత్రలో ఆయన ఎనర్జీ, నటన, డాన్సులు, ఫైట్స్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. ఇక సెకండ్ లుక్ లో విగ్స్ కాస్త ఇబ్బంది పెట్టినా పవర్ఫుల్ పాత్రలో న్యాయం చేసాడు. లుక్స్ తో పాటు డైలాగ్ డెలివరీలో కూడా పాత్రకి తగ్గట్టు చేసిన మార్పులు బాగున్నాయి. ఓవరాల్ గా అభిమానులకి బాలయ్య బాగా నచ్చేస్తాడు.

ఇద్దరు హీరోయిన్స్ లో వేదిక గ్లామరస్ లుక్స్ తో పాటు నటనకి ప్రాధాన్యం ఉన్న రెండు మూడు సీన్స్ లో తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సోనాల్ చౌహాన్ అయితే కంప్లీట్ అందాల ఆరబోతకే పరిమితమై మాస్ ఆడియన్స్ ని తన స్కిన్ షో తో ఆకర్షించింది. నాగినీడు, ప్రకాష్ రాజ్, భూమికలు తమ పాత్రలకి న్యాయం చేశారు. శ్రీనివాస రెడ్డి, సాయాజీ షిండే, సప్తగిరి, ధన్ రాజ్ లాంటి వారి కామెడీ బాగుంది.

ఇక సినిమా పరంగా చూసుకుంటే.. సినిమా ప్రారంభం ఆసక్తిగా ఉంటుంది. అలాగే సాఫ్ట్ వేర్ లుక్ పాత్రలో ఇంట్రడక్షన్ సీన్స్, డాన్సులు చాలా బాగున్నాయి. కామెడీ సీన్స్ తో పాటు ఇంటర్వల్ యాక్షన్ బ్లాక్ మరియు సెకండాఫ్ మొదటి 30 నిమిషాలు, రైతుల మీద వచ్చే సీన్ మాస్ ఆడియన్స్ చేత ఈలలు వేయిస్తాయి.

ఆఫ్ స్క్రీన్:

సి. రాంప్రసాద్ విజువల్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ విజువల్స్ సూపర్బ్ అని చెప్పాలి. అలాగే బాలయ్యని ఫస్ట్ హాఫ్ లో చూపిన విధానం కూడా సూపర్బ్. ఇక రామ్ – లక్షణ్ మాస్టర్స్, అంబు – అరివు కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి. పరుచూరి మురళి రాసిన డైలాగ్స్ మాత్రం బాలయ్య అభిమానులకి మంచి ఎనర్జీని ఇస్తాయి. చిరంతన్ భట్ పాటలు మరియు నేపధ్య సంగీతం బాగుంది. చిన్నా ఆర్ట్ వర్క్ బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

సెకండాఫ్ లో బాలకృష్ణకి వాడిన హెయిర్ స్టైల్స్ అంతగా సెట్ అవ్వకపోవడంతో చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇకపోతే సెకండాఫ్ లో పాట, ఫైట్ అన్న ఫార్మాట్ లో సినిమా సాగడం, ఓవర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ అవ్వడంతో కాస్త బోర్ కొడుతోంది. అసలైన కథ కూడా పెద్దగా లేకపోవడంతో చివరికి వచ్చేసరికి బాగా ఇర్రిటేట్ గా ఫీలవుతారు. ఆస్తి వివాదం కన్నా రైతుల పాయింట్ ని, సెటిలర్స్ పాయింట్ ని మెయిన్ హైలైట్ గా చెప్పుంటే ఇంకా బాగుండేది.

ఆఫ్ స్క్రీన్:

ముందుగా ఈ కథని తయారు చేసిన పరుచూరి మురళి దగ్గరికి వస్తే.. మరీ పాత చింతకాయపచ్చడి కన్నా పాత కథని పిచ్చ బోరింగ్ గా చెప్పారు. ఇలాంటి కథల్ని మనం ఒక 15-20 ఏళ్ళ క్రితం నుంచీ చూస్తూ వస్తున్నాం. సరే అంత పాత రొట్ట కథ రాసుకున్నారు కనీసం కథనం అయినా కొత్తగా రాసుకున్నారా అంటే అదీ లేదు. కేవలం బాలయ్య గెటప్ చేంజ్ లోనే కొత్త కథనం వచ్చేసింది అనే వెర్రితనంలో స్క్రీన్ ప్లే రాసినట్టు ఉంటుంది. ఓవరాల్ గా కథ – కథనం విషయంలో పూర్ మెటీరియల్ అనిపించాడు. ఇకపోతే ఆ కథని జడ్జ్ చేయడంలో కెఎస్ రవికుమార్ కూడా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే ఆయనే ఇలాంటి సినిమాలు గతంలో చేశారు అలాంటి డైరెక్టర్ మళ్ళీ అలాంటి కథ ఎంచుకోవడం బాధాకరం. ఇక మేకింగ్ పరంగా వీలైనంత బెటర్ అవుట్ ఫుట్ ఇచ్చి ఆ బొక్కల్ని కవర్ చేయాలనీ ట్రై చేసాడు. అది ఫస్ట్ హాఫ్ వరకూ మేనేజ్ చేసినా సెకండాఫ్ లో చేయలేకపోయాడు. సెకండాఫ్ కి ప్రేక్షకులు పిచ్చ బోర్ గా ఫీలవుతున్నారు.

జాన్ అబ్రహం ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. సి కళ్యాణ్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాగా రిచ్ గా ఉన్నప్పటికీ ఇలాంటి ఓల్డ్ ఫార్మటు కథకి అంత అవసరం లేదనిపిస్తుంది. అలా కెఎస్ రవికుమార్ బాలయ్య అభిమానుల్ని సంతృప్తి పరచగలిగాడే తప్ప, అన్ని వర్గాల సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.

విశ్లేషణ:

మామూలుగా నందమూరి బాలకృష్ణ నుంచి ఎలాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్స్ ఆశిస్తారో అలాంటి సినిమానే ‘రూలర్’. కానీ ఒక్క బాలయ్య సాఫ్ట్ వేర్ లుక్ లో తప్ప మిగతా ఎక్కడ కూసింత కొత్తదనం కూడా లేకపోగా, కథ – కథనం పరంగా మనందరినీ ఒక 15 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లే సినిమా ‘రూలర్’. అంత పాత సబ్జెక్టుని అంతకన్నా బోరింగ్ గా తీశారు. ఈ కథకి పెట్టాల్సిన పవర్ఫుల్ టైటిల్ కాదు ‘రూలర్’, కానీ ఏం లాభం ఈ పరమ రొటీన్, బోరింగ్ సినిమాకి పెట్టి వృధా చేసేసారు. కెఎస్ రవికుమార్ బాలయ్య అభిమానుల్ని, ఊర మాస్ సినిమాలు కోరుకునే బి, సి సెంటర్ ఆడియన్స్ ని ఒక పరిధి వరకూ సంతృప్తి పరచగలిగాడే తప్ప, అన్ని వర్గాల సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. మరి కేవలం మాస్ ఆడియన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఆదరిస్తారో చూడాలి..

ఫైనల్ పంచ్: రూలర్ – వృధా అయిన బాలయ్య మేకోవర్ అండ్ ఎనర్జీ.!

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2/5

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్.. నిర్మాత: సి కళ్యాణ్ దర్శకత్వం: కెఎస్ రవికుమార్ సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్ మ్యూజిక్: చిరంతన్ భట్ ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019 స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథతో నందమూరి బాలకృష్ణ చేసిన బయోపిక్ నిరాశ పరిచింది. ఆ సినిమా తర్వాత బాలయ్య మళ్ళీ తన అభిమానులు కోరుకునే మాస్ అవతార్ లో చేసిన సినిమా 'రూలర్'....నందమూరి బాలకృష్ణ 'రూలర్' మూవీ రివ్యూ