ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో కొన్ని మీడియా సంస్థల్ని పెట్టుకుందన్నది బహిరంగ రహస్యం.
ఆయా మీడియా సంస్థల్లో తమకు అవసరమైన రీతిలో కథనాల్ని రాయిస్తూ వస్తోంది. వైసీపీ నుంచే, ఈ కతనాలు ఆయా మీడియా సంస్థలకు వెళతాయి. వాటికి చిన్న ఆల్ట్రేషన్స్ చేసి, ఆయా మీడియా సంస్థలు ఆయా కథనాల్ని వెబ్ సైట్లలో పొందుపరుస్తాయి.. పత్రికల్లోనూ ప్రచురిస్తుంటాయి.
అలాంటి నీలి వెబ్ సైట్లలో ఒకటి, తాజాగా ఓ కథనాన్ని ప్రచారంలోకి తెచ్చింది. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి గనుక అధికారంలోకి వస్తే, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు, బీజేపీ పెద్దల్ని పిలిచి సన్మానం చేయాలని సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖులు అనుకుంటున్నారట. ఓ పెద్ద నిర్మాత ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నది ఆ కథనం తాలూకు సారాంశం.
ఇక్కడివరకూ ఈ కథనాన్ని తప్పు పట్టలేం. కాకపోతే, ‘ఐదేళ్ళుగా మంత్రులకీ, అధికారులకీ కావాల్సింది ఇచ్చి పనులు చేయించుకున్న తెలుగు సినీ నిర్మాతలు’ అంటూ ఆ కథనంలో ‘స్టేట్మెంట్’ పాస్ చేయడం దగ్గరే అడ్డంగా దొరికిపోయింది వైసీపీ అను‘కుల’ మీడియా.
అంటే, నిర్మాతలు ఇచ్చింది తీసుకుని, ఆయా సినిమాలకి వైసీపీ మంత్రులు మేలు చేశారా.? వైసీపీ హయాంలో అధికారులు కూడా నిర్మాతలు ఇచ్చింది తీసుకుని, ఆయా సినిమాలకు అనుకూలంగా వ్యవహరించారా.? అన్న ప్రశ్న తెరపైకొస్తుంది కదా.?
వైసీపీ అను‘కుల’ మీడియా కాదు, వైసీపీ అధికారిక మీడియానే అది. ఆ లెక్కన, తాము ఐదేళ్ళపాటు అవినీతి చేశామనీ, సినీ పరిశ్రమని దోచేశామని వైసీపీనే స్టేట్మెంట్ ఇచ్చినట్లయ్యింది. సో, రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఏర్పాటైతే, సినీ ప్రముఖుల్ని పిలిచి, గత ఐదేళ్ళలో వైసీపీ కొట్టేసిన అవినీతి సొమ్ము ఎంత.? అన్న లెక్కలు తేల్చాల్సి వుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ ప్రముఖుడే.. టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ కూడా సినీ ప్రముఖుడే.. ఈ ఇద్దరూ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సి వుందిప్పుడు. వైసీపీ అధికారం కోల్పోతుందనే అసహనంతో, వైసీపీ అను‘కుల’ మీడియా రాస్తున్న ఈ కథనాలు, వైసీపీ పతనాన్ని మరింత అసహ్యకరమైన స్థాయికి తీసుకెళుతున్నాయన్నది నిర్వివాదాంశం.
ఒక్కటి మాత్రం నిజం. ఐదేళ్ళుగా సినీ పరిశ్రమని ఆంధ్ర ప్రదేశ్‌లోని అధికార వైసీపీ పీడించుకు తినేసింది.! అది వైసీపీ అను‘కుల’ మీడియా తాజా వార్తా కథనాల్లోనూ స్పష్టమవుతోంది. ఇంత నిస్సిగ్గుగా తమ దోపిడీనీ, తమ అవినీతిని బయటపెట్టుకుంటున్న వైసీపీని ఏమనాలి.?