Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా శామ్ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బడ్డీ’. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి రొమాంటిక్ నెంబర్ ఆ పిల్ల కనులే.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మధ్య కాలంలో అల్లు శిరీష్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ప్రేక్షకులు ఇంకా ఎప్పుడు ఎప్పుడు అన్నట్లుగా ఎదురు చూశారు. ఎట్టకేలకు బడ్డీ ఫస్ట్ సింగిల్ రావడంతో సినిమా పై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న బడ్డీ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆ పిల్ల కనులే, చూశాక తననే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే, మైకంలో తేలే, మబ్బులు తాకే, ఇద్దరి కథ ఇక మొదలాయే, నింగి నేల కలిశాయో, ఊసులేవో పలికాయో… అంటూ సాగే ఈ పాటను సంజిత్ హెగ్డే మరియు ఐరా, విష్ణు ప్రియా రవి పాడారు.
హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించిన ఈ పాట కచ్చితంగా శ్రోతల అభిమానంను దక్కించుకుంటుందని మేకర్స్ అంటున్నారు. త్వరలోనే విడుదల తేదీపై ప్రకటన చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.