Switch to English

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,388FansLike
57,764FollowersFollow

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’ అంటూ నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ అయిన ట్వీట్ పెను వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్‌ని ఉద్దేశించే నాగబాబు ఆ ట్వీట్ వేశారంటూ ఓ సెక్షన్ మీడియా, అత్యంత వ్యూహాత్మకంగా ఈ ట్వీటుని వివాదాస్పదం చేసింది. జనసేన పార్టీలో వుంటూ, జనసేన పార్టీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసిన పోతిన మహేష్, కళ్యాణ్ దిలీప్ సుంకర లాంటోళ్ళని ఉద్దేశించి నాగబాబు ట్వీటేశారన్నది ఓ వాదన.

కాదు కాదు, నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతివ్వడంతో, అది జీర్ణించుకోలేక నాగబాబు ఇలా ట్వీటేశారన్నది ఇంకో వాదన. తెలుగు నాట మీడియా అంటే, పెయిడ్ ఆర్టికల్స్ మాత్రమేనన్నది బహిరంగ రహస్యం. అలా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయ్.. నాగబాబుకి వ్యతిరేకంగా కథనాలు రాయించడానికి.

పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఈ కథనాలతో పెద్ద అగాధం ఏర్పడిందనే సంకేతాలు అయితే వెళ్ళాయి. అల్లు అర్జున్‌ని కూడా మెగా హీరోగానే చూస్తామని మెగాభిమానులు ఎంతలా చెబుతున్నా, అల్లు అర్జున్ అభిమానుల్లోనూ చాలామంది ఇదే విషయాన్ని కుండబద్దలుగొడుతున్నా, కొన్ని పెయిడ్ ట్విట్టర్ హ్యాండిల్స్.. విపరీతమైన నెగెటివిటీని క్రియేట్ చేశాయి.

వివాదం ముదిరి పాకాన పడేసరికి, నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మూగబోయింది. సాంకేతిక పరమైన సమస్య.. అనే వాదన ఒకటి తెరపైకొచ్చింది. అదే నిజమైతే, నాగబాబు స్పందించి వుండేవారు కదా.? అన్న వాదననీ కొట్టి పారేయలేం.

ఎలాగైతేనేం, నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మళ్ళీ యాక్టివ్ అయ్యింది. ‘నా ట్వీటుని తొలగించడమైనది’ అంటూ నాగబాబు తాజాగా ట్వీటేశారు. ఆ ట్వీటు చుట్టూ మళ్ళీ రచ్చ మొదలైంది. ఇంత జరుగుతున్నా అల్లు అర్జున్, తన అభిమానుల్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం ఒకింత ఆశ్చర్యకరం.

ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా.? ముందు ముందు మరింత ముదిరి పాకాన పడుతుందా.? అది, పెయిడ్ మీడియా, పెయిడ్ సోషల్ మీడియాకి అందే ‘ముడుపుల్ని బట్టి’ ఆధారపడి వుంటుందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.

కుటుంబమన్నాక అభిప్రాయ బేధాలు వుండొచ్చు. అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్ళి వుండొచ్చు. అది వేరే చర్చ. జనసేనాని గెలవాలని కూడా అల్లు అర్జున్ ఆకాంక్షించాడు కదా.! జనసేన పార్టీ ఎలాగైతే, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కంట్రోల్ చేసిందో, అలాగే అల్లు అర్జున్ కూడా తన అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాలి కదా.?

అల్లు అర్జున్ ఆర్మీని అల్లు అర్జున్ ఒకింత ఎక్కువగా వెనకేసుకొస్తున్నాడు. అదే అన్ని అనర్థాలకీ కారణమవుతోంది. అభిమాన సంఘాల్ని హీరోలు వెనకేసుకురావడం కొంతవరకు తప్పు కాకపోవచ్చు. కానీ, అత్యంత అసభ్యకరమైన రీతిలో, జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్ జరుగుతున్న దరిమిలా, ఆ ‘ఆర్మీ’ని అల్లు అర్జున్ ఒకింత అదుపులో పెట్టుకోవాల్సి వుంటుందన్నది నిర్వివాదాంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

CBN : బాబు ప్రమాణ స్వీకారం కోసం టాలీవుడ్‌…!

CBN : ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ...

Pawan : అకీరా ఎంట్రీ ఇవ్వాల్సిన టైమ్‌ వచ్చినట్లే..!

Pawan : పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటూ చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితమే...

Ramoji Rao : సినీ నిర్మాతగా రామోజీరావు…!

Ramoji Rao : 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన రామోజీరావు తెలుగు జాతిపై చెరగని ముద్ర వేశారు. తెలుగు పదం ఉన్నంత కాలం...

Balakrishna : బాలయ్యకి మంత్రి పదవి… మరి సినిమాలు?

Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుసగా మూడవ సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా గాలి బలంగా వీచినా కూడా...

Chiranjeevi: అరుదైన కలయిక.. 34ఏళ్ళ తర్వాత చిరంజీవిని కలిసిన నాటి బాలనటులు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటి జగదేకవీరుడు అతిలోక సుందరి. సినిమాలో చిరంజీవి-శ్రీదేవి జోడీ...

రాజకీయం

CBN : బాబు ప్రమాణ స్వీకారం కోసం టాలీవుడ్‌…!

CBN : ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్...

Balakrishna : బాలయ్యకి మంత్రి పదవి… మరి సినిమాలు?

Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుసగా మూడవ సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా గాలి బలంగా వీచినా కూడా తట్టుకుని నిలబడ్డ బాలకృష్ణ ఈసారి కూడా...

Kamal Haasan: ‘గర్వంగా ఉంది బ్రదర్’.. పవన్ కల్యాణ్ కు కమల్ హాసన్ విషెష్

Kamal Haasan: ఏపీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాధించిన అద్వితీయమైన విజయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్నికల్లో ఆయన...

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 12 వ తేదీ ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం...

పవన్ తల్లికి తగ్గ కొడుకు.. అనా భర్తకు తగ్గ భార్య

ప్రతి మగాడి విజయం వెనకా ఒక ఆడది ఉంటుందంటారు. అది తల్లి రూపంలో అయినా సరే..భార్య రూపంలో అయినా సరే. మరే రూపంలో అయినా సరే. ఏ మనిషికైనా గట్టి సపోర్టింగ్ సిస్టం...

ఎక్కువ చదివినవి

MEGA family: ‘అపూర్వ ఘట్టం..’ కళ్లు చెమర్చుతున్న మెగా ఫ్యామిలీ వీడియో

TELUGU BULLETIN SPECIAL STORY MEGA family: ఓ మనిషికి ఎవరెంత భరోసా ఇచ్చినా.. చుట్టూ ఉన్నవారు అభిమానించినా.. సమాజమే ఆత్మీయత చూపినా.. “కుటుంబం” ఇచ్చే భరోసా ముందు మరేదీ సాటిరాదు. మన భారతీయ...

Pawan : అకీరా ఎంట్రీ ఇవ్వాల్సిన టైమ్‌ వచ్చినట్లే..!

Pawan : పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటూ చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితమే అదిగో అకీరా హీరోగా, ఇదుగో కథ...

AP Election Results-2024: ఏపీ ఎన్నికల ఫలితాలు – కూటమి ప్రభంజనం

Assembly(175/175) Loksabha (25/25) LEAD WIN LEAD WIN TDP - 135 - 16 JANASENA - 21 - 2 YSRCP - 11 - 4 BJP - 8 - 3   20.31 P.M: సత్తెనపల్లి అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ విజయం 20.12 P.M: పుట్టపర్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి పల్లె సింధూరా రెడ్డి విజయం 20.10 P.M: ఆత్మకూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి...

జాతీయ మీడియాలో ‘పవర్’ సేనాని.! కానీ, జాతి తక్కువ మీడియాలో.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు జాతీయ మీడియాలో మార్మోగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో యువతను కూటమి వైపు తిప్పడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర గురించి, నేషనల్ మీడియా...

ఓటమి బాటలో ఏపీ మంత్రులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కూటమి పార్టీలు జోరు చూపిస్తున్నాయి. ఇప్పటికే 150 కి పైగా సీట్లలో భారీ ఆధిక్యం కనబరుస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సిపి 13 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్...